న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: మూడో వన్డేకు బుమ్రా, చాహల్‌ దూరం.. సన్‌రైజర్స్ బౌలర్‌కు చాన్స్!

India vs Australia: Should Team India management drop Jasprit Bumrah, Yuzvendra Chahal?

హైదరాబాద్: కరోనాతో అంతర్జాతీయ క్రికెట్‌లో స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆసీస్‌ పర్యటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సూపర్‌ స్టార్లతో కూడిన జట్లు కావడంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయనిపించింది. కానీ ఇప్పటికైతే భారత జట్టు ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదు. అన్ని విభా గాల్లోనూ విఫలమై వరుసగా రెండు పరాజయాలతో మరో మ్యాచ్‌ ఉండ గానే సిరీస్‌ను కోల్పోయింది. ముఖ్యంగా ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీసేన చెత్త బౌలింగ్‌తోనే మూల్యం చెల్లించుకుంది.

ఈ రెండు వన్డేల్లో ఆసీస్ ఆటగాళ్లు 375 పరుగులకు పైగా లక్ష్యాన్ని నిర్ధేశించారంటే భారత బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం కాన్‌బెర్రా వేదికగా జరిగే మూడో వన్డేలో కోహ్లీసేన భారీ మార్పులతో బరిలోకి దిగాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది.

బుమ్రా, చాహల్‌ను తప్పించాలి?

బుమ్రా, చాహల్‌ను తప్పించాలి?

స్వదేశంలో ఆడినా.. ఫారిన్‌‌ టూర్‌‌కు వెళ్లినా అవతలి జట్టులో బెస్ట్‌‌ ప్లేయర్‌‌ను టార్గెట్‌‌ చేయడం ఆస్ట్రేలియా శైలి‌. ఈ సిరీస్‌‌లో కూడా వాళ్లు అదే ఫార్ములా కొనసాగించారు. ఇండియా టాప్‌‌ పేసర్‌‌, స్పిన్నర్ అయిన బుమ్రా, చాహల్‌ను టార్గెట్‌‌ చేసిన కంగారూలు అందులో సక్సెస్‌‌ అయ్యారు. మరోవైపు బుమ్రా, చాహల్ బౌలింగ్‌‌లో ఎలాంటి వైవిధ్యం కనిపించలేదు. ఐపీఎల్‌‌లో గొప్పగా ఆడిన ఈ ఇద్దరూ ఆసీస్ గడ్డపై తేలిపోయారు. దారళంగా పరుగులిచ్చుకున్నారు. బుమ్రా రెండు మ్యాచ్‌ల్లో (1/73), (1/79) రెండు వికెట్లు తీసి 152 రన్స్ ఇవ్వగా.. చాహల్ 19 ఓవర్లు వేసి 160 పరుగులిచ్చాడు. దాంతో నామమాత్రపు మూడో వన్డేకు ఈ ఇద్దరిని పక్కన పెట్టి ఇతర బౌలర్లకు అవకాశం ఇవ్వాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీపక్, నట్టూను తీసుకోవాలి..

దీపక్, నట్టూను తీసుకోవాలి..

ముఖ్యంగా టీమ్‌‌లో భువనేశ్వర్‌‌ కుమార్‌‌ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బంతితో అటాకింగ్‌‌ బౌలర్‌‌గా అతను పవర్‌‌ ప్లేలో జట్టుకు శుభారంభాలు ఇచ్చేవాడు. కానీ, గాయం కారణంగా భువీ టీమ్‌‌కు దూరం కావడంతో బుమ్రా, షమీలపైనే ఈ బాధ్యత పడింది. పైగా, ఈ సిరీస్‌‌లో మూడో పేసర్‌‌గా వచ్చిన నవదీప్‌‌ సైనీ విఫలమవడంతో వారిద్దరిపై ఇంకా ఒత్తిడి పెరిగింది. దాంతో భువీ మాదిరిగా కొత్త బంతి‌తో సత్తాచాటే దీపక్‌‌ చహర్‌‌కు చాన్స్‌‌ ఇవ్వాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. బుమ్రాకు బదులు అతనికి అవకాశం ఇవ్వాలంటున్నారు. ఐపీఎల్‌‌లో అదరగొట్టిన టీ20తో పాటు వన్డే టీమ్‌‌లో చోటు దక్కించుకున్న యార్కర్ల స్పెషలిస్ట్‌‌ టి. నటరాజన్‌‌ను సైనీ ప్లేస్‌లో, కుల్దీప్‌ను చాహల్ స్థానంలో తీసుకుంటే ఫలితం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

బ్యాటింగ్‌లో మార్పులు..

బ్యాటింగ్‌లో మార్పులు..

ఇక జట్టు ఓటమికి భారత ఓపెనింగ్ జోడీ వైఫల్యం కూడా ఓ కారణం. భారీ లక్ష్యాలను చేధించాలంటే మంచి ఆరంభం దక్కాలి. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఇది జరగలేదు. ఫస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ ధావన్ హాఫ్ సెంచరీతో రాణించినా.. మయాంక్ అగర్వాల్ రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. దాంతో అతనిపై వేటు వేసి మనీశ్ పాండేను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను పంపించి పాండేను మిడిలార్డర్‌లో ఆడించాలంటున్నారు. అయ్యర్ స్థానంలో శాంసన్‌కు కూడా అవకాశం ఇవ్వచ్చని అభిప్రాయపడుతున్నారు. మరీ టీమ్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి.

నిపుణులు సూచిస్తున్న భారత తుది జట్టు:

కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/సంజూ శాంసన్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, నటరాజన్

ఐపీఎల్ చూసి ఆటగాళ్లను తీసుకుంటున్నప్పుడు.. కెప్టెన్‌‌ను కూడా అలానే ఎంచుకోవాలి!

Story first published: Tuesday, December 1, 2020, 12:27 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X