న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ముంబై-చెన్నై పోరు భారత్-పాక్‌లా ఉండేది: భజ్జీ

Harbhajan Singh Says Whenever MI played against CSK, it was like India-Pakistan

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడినప్పుడల్లా భారత్-పాకిస్థాన్ పోరులా ఉండేదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ నుంచి 2018లో చెన్నైకు మారేవరకు హర్భజన్ ముంబై తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

పదేళ్లపాటు ముంబైకి ఆడిన తాను తొలిసారి ఎల్లో జెర్సీ ధరించినప్పుడు వింతగా అనిపించిందన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రజెంటర్ రుపా రమణితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న భజ్జీ ధోనీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు చెన్నై ప్లేయర్‌గా తన అనుభవాలను వెల్లడించాడు.

మొదట్లో చెన్నైకి ఆడటం కష్టంగా..

మొదట్లో చెన్నైకి ఆడటం కష్టంగా..

ఇక చెన్నై జెర్సీ తొలిసారి ధరించినప్పుడు.. తనను తాను నమ్మలేకపోయానని, కలనా? నిజమా అర్థం కాలేదన్నాడు. చాలా వింతగా అనిపించిందని తెలిపాడు. 10 ఏళ్లు ముంబైకి ఆడిన తనకు చెన్నై జెర్సీ ధరించడం కొంత కష్టంగా కూడా అనిపించిందన్నాడు. ‘చెన్నై జెర్సీ వేసుకున్న తొలిసారైతే వింతగా అనిపించింది. అసలేం జరుగుతుంది. ఇది కలనా? నిజమా? అర్థం కాలేదు. ముంబై తరఫున చెన్నైతో ఆడినప్పుడల్లా భారత్-పాక్ మ్యాచ్‌లా అనుకునేవాళ్లం. మ్యాచ్ కూడా చాలా టఫ్‌గా ఉండేది. కానీ ఆకస్మాత్తుగా నేను బ్లూ జెర్సీకి బదులు ఎల్లో జెర్సీ ధరించడం కష్టంగా అనిపించింది. అదృష్టవశాత్తు చెన్నై తరఫున నా తొలి మ్యాచ్ కూడా ముంబైతోనే జరిగింది. ప్రారంభంలోనే ఆడటం కూడా నాకు మంచిదైంది. తొలి సీజన్ అంతా కొంచెం కష్టంగా అనిపించింది. టైటిల్ గెలిచిన తర్వాత మాత్రం అలవాటైపోయింది. రెండో సీజన్ బాగా సాగింది. ఇక ఆ ఫీలింగ్ కలగలేదు'అని భజ్జీ తెలిపాడు.

చాలా సిగ్గుపడేవాడు..

చాలా సిగ్గుపడేవాడు..

ఎంఎస్ ధోనీ కెరీర్ ప్రారంభంలో చాలా సిగ్గుపడేవాడని, ఎవరితో మాట్లాడకపోయేవాడని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. కనీసం మహీ నోట్లో నుంచి మాటలు కూడా వచ్చేవి కావని గుర్తుచేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అయితే 2008 సిడ్నీ టెస్ట్‌లో చోటు చేసుకున్న మంకీగేట్ వివాదం మహీని పూర్తిగా మార్చేసిందని ఈ వెటరన్ ప్లేయర్ తెలిపాడు.

మా రూమ్స్‌కు కూడా వచ్చేవాడు కాదు..

మా రూమ్స్‌కు కూడా వచ్చేవాడు కాదు..

ధోనీతో మరిచిపోలేని క్షణాలు షేర్ చేసుకోవాలని భజ్జీని ప్రశ్నించగా.. మహీ సిగ్గరనే విషయాన్ని వెల్లడించాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ధోనీ స్వేచ్చగా మాట్లాడడం ప్రారంభించాడని చెప్పుకొచ్చాడు. ‘మేమిద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడాం. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల్లో పర్యటించాం. మొదట్లో ధోనీ చాలా సిగ్గు పడుతుండేవాడు. మా గదులకు కూడా వచ్చేవాడు కాదు. చాలా మౌనంగా ఉండేవాడు. సచిన్, జహీర్,ఆశిశ్, యూవీలతో ఆ టూర్‌లను ఆస్వాదించేవాళ్లం. కానీ ధోనీ మాత్రం తన ప్రపంచంలోనే ఉండేవాడు.

ఆ గొడవతో సెట్ అయ్యాడు..

ఆ గొడవతో సెట్ అయ్యాడు..

అయితే ఆస్ట్రేలియాతో 2008లో జరిగిన సిడ్నీ టెస్టు జట్టును మరింత ఐకమత్యంగా తయారు చేసింది. అప్పటి నుంచి ధోనీ స్వేచ్ఛగా ఉంటూ అన్ని విషయాలను పంచుకోవడం ప్రారంభించాడు. కెప్టెన్​ అయ్యాక కూడా ధోనీ అందరికీ సలహాలు ఇచ్చేవాడు. అలాగే అభిప్రాయలను చెప్పేందుకు అందరినీ అనుమతించేవాడు. అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చేవాడు'అని హర్భజన్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. ఇక 2008లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆసీస్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్​, హర్భజన్ సింగ్​కు మధ్య తలెత్తిన మంకీగేట్ వివాదం తీవ్ర దుమారాన్నే రేపింది. అప్పుడు భారత జట్టుంతా భజ్జీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్ క్రికెటర్‌తో ఎఫైర్ అంటూ తమన్నాపై తప్పుడు ప్రచారం.!

Story first published: Thursday, May 7, 2020, 11:44 [IST]
Other articles published on May 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X