Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్ క్రికెటర్‌తో ఎఫైర్ అంటూ తమన్నాపై తప్పుడు ప్రచారం.!

Old Pic of Tamannaah Bhatia with Pakistani Cricketer Abdul Razzak in a Jewellery Shop Goes Viral

హైదరాబాద్: స్టార్ క్రికెటర్లు.. సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమాయణం కొత్త కాదు. కొన్ని జంటలు పెళ్లిపీటలు కూడా ఎక్కాయి. ఇక క్రికెటర్లకు.. హీరోయిన్లకు లింకులు పెడుతూ చేసే ప్రచారం కూడా అంతఇంత కాదు. ఇందులో కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ.. అవాస్తవాలే ఎక్కువ ప్రచారం జరుగుతాయి. తాజాగా
సౌతిండియన్ స్టార్ హీరోయిన్, మిల్క్ బ్యూటీ తమన్నాపై కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రచారం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే మూడేళ్ల కింది ఫొటోను తాజాగా ట్రెండ్ చేస్తూ ఈ తప్పుడు ప్రచారానికి పూనుకోవడం.

ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే..

ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే..

అప్పుడు ఎప్పుడో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి తమన్నా ఓ జ్యూవెలరీ షాప్‌ ఓపెనింగ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులైన ఈ ఇద్దరు బంగారాన్ని చూపిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. అంతే.. ఆ ఫొటోను పట్టుకొని పాక్ క్రికెటర్‌తో తమన్నా ఎఫైర్ అని, త్వరలో పెళ్లి కూడా చేసుకుబోతుందని, అందుకే బంగారం కొనేందుకు వెళ్ళిందంటూ ప్రచారం స్టార్ట్ చేశారు.

2017 నాటి ఫొటో..

2017 నాటి ఫొటో..

వాస్తవానికి ఆ ఫొటో 2017లో దుబాయ్‌లో ఓ జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు సంబంధించిందని టైమ్స్ ఇండియా పేర్కొంది. ఇన్నాళ్లు పక్కనపెట్టిన ఈ ఫొటోను.. లాక్ డౌన్ సమయంలో తెరపైకి తీసుకొచి ఈ తప్పడు ప్రచారానికి తెరలేపారు.. నెట్టింటి కేటుగాళ్లు. అయితే ఈ ఫొటో రూమర్స్‌పై ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటికీ స్పందించకపోయినప్పటికీ.. గతంలో మాత్రం ఈ తరహా పుకార్లను కొట్టిపారేసింది. మీడియా సమావేశంలోనే ఈ తరహా పుకార్లను వైరల్ చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ తప్పుడు ప్రచారం సరైంది కాదు..

ఈ తప్పుడు ప్రచారం సరైంది కాదు..

‘ఒకరోజు డాక్టర్‌ను పెళ్లాడనున్న తమన్నా అంటారు.. ఇంకోరోజు క్రికెటర్ అంటారు.. కాబోయే భర్తతో షాపింగ్ చేస్తుందని రాస్తారు. ఇలాంటి ఎర్రి పుకార్లను ఆపాలి. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వైరల్ చేయడం కరెక్ట్ కాదు'అని ఈ మిల్క్ బ్యూటీ మండిపడింది. తనకు ఎవరితో ఎలాంటి ఎఫైర్ లేదని, మరో రెండేళ్లలో తాను పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని స్పష్టం చేసింది.

రజాక్ పెళ్లి అయింది..

రజాక్ పెళ్లి అయింది..

అబ్దుల్ రజాక్ పాకిస్థాన్ తరఫున 265 వన్డేలు, 46 టెస్ట్‌లు, 32 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 1946, వన్డేల్లో 5080, టీ20ల్లో 393 పరుగులు చేశాడు. మీడియం పేసర్ అయిన రజాక్.. మూడు ఫార్మాట్లలో కలిపి 389 వికెట్లు పడగొట్టాడు. 2009 టీ20 ప్రపంచకప్‌లో గెలుచుకున్న పాక్ జట్టులో రజాక్ సభ్యుడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రజాక్.. అతనంతం దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఇక అతనికి అయేశా రజాక్‌తో పెళ్లి కూడా అయింది.

ధోనీ వారుసడన్న పంత్ వాటర్ బాటిళ్లు అందిస్తుండు: నెహ్రా

Story first published: Wednesday, May 6, 2020, 14:10 [IST]
Other articles published on May 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+