న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ చాలా సిగ్గుపడేవాడు.. కానీ ఆ వివాదం అతన్ని మార్చేసింది: భజ్జీ

 Harbhajan Singh recalls series when Dhoni started to open up with team members

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలోనే మరే సారథి సాధించనన్ని విజయాలు.. ఐసీసీ టైటిళ్లు ఈ జార్ఖండ్ డైనమైట్ అందించాడు. టెస్ట్‌ల్లో నెంబర్ వన్ జట్టుగా నిలిపాడు. క్రికెట్‌ను శాసించే స్థాయికి తీసుకొచ్చాడు. అనామకుడిగా జట్టులోకి వచ్చి అసాధరణ క్రికెటర్‌గా నిలిచాడు.

 చాలా సిగ్గుపడేవాడు..

చాలా సిగ్గుపడేవాడు..

అలాంటి ధోనీ కెరీర్ ప్రారంభంలో చాలా సిగ్గుపడేవాడని, ఎవరితో మాట్లాడకపోయేవాడని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. కనీసం మహీ నోట్లో నుంచి మాటలు కూడా వచ్చేవి కావని గుర్తుచేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అయితే 2008 సిడ్నీ టెస్ట్‌లో చోటు చేసుకున్న మంకీగేట్ వివాదం మహీని పూర్తిగా మార్చేసిందని ఈ వెటరన్ ప్లేయర్ తెలిపాడు.

 మా రూమ్స్‌కు కూడా వచ్చేవాడు కాదు..

మా రూమ్స్‌కు కూడా వచ్చేవాడు కాదు..

ధోనీతో మరిచిపోలేని క్షణాలు షేర్ చేసుకోవాలని భజ్జీని ప్రశ్నించగా.. మహీ సిగ్గరనే విషయాన్ని వెల్లడించాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ధోనీ స్వేచ్చగా మాట్లాడడం ప్రారంభించాడని చెప్పుకొచ్చాడు. ‘మేమిద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడాం. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల్లో పర్యటించాం. మొదట్లో ధోనీ చాలా సిగ్గు పడుతుండేవాడు. మా గదులకు కూడా వచ్చేవాడు కాదు. చాలా మౌనంగా ఉండేవాడు. సచిన్, జహీర్,ఆశిశ్, యూవీలతో ఆ టూర్‌లను ఆస్వాదించేవాళ్లం. కానీ ధోనీ మాత్రం తన ప్రపంచంలోనే ఉండేవాడు.

 ఆ గొడవతో సెట్ అయ్యాడు..

ఆ గొడవతో సెట్ అయ్యాడు..

అయితే ఆస్ట్రేలియాతో 2008లో జరిగిన సిడ్నీ టెస్టు జట్టును మరింత ఐకమత్యంగా తయారు చేసింది. అప్పటి నుంచి ధోనీ స్వేచ్ఛగా ఉంటూ అన్ని విషయాలను పంచుకోవడం ప్రారంభించాడు. కెప్టెన్​ అయ్యాక కూడా ధోనీ అందరికీ సలహాలు ఇచ్చేవాడు. అలాగే అభిప్రాయలను చెప్పేందుకు అందరినీ అనుమతించేవాడు. అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చేవాడు'అని హర్భజన్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. ఇక 2008లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆసీస్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్​, హర్భజన్ సింగ్​కు మధ్య తలెత్తిన మంకీగేట్ వివాదం తీవ్ర దుమారాన్నే రేపింది. అప్పుడు భారత జట్టుంతా భజ్జీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

అశ్విన్ బెస్ట్ స్పిన్నర్..

అశ్విన్ బెస్ట్ స్పిన్నర్..

ప్రస్తుత తరంలో​​ రవిచంద్రన్ అశ్వినే అత్యుత్తమ ఆఫ్​ స్పిన్నర్ అని హర్భజన్ సింగ్ కొనియాడాడు. అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో మట్లాడుతూ..‘మన ఇద్దరి మధ్య ఈర్ష్య ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే అలాంటిదేం లేదని అందరికీ చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో ప్రస్తుతం ఆశ్వినే అత్యుత్తమ ఆఫ్​ స్పిన్నర్​. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్​ లియోన్ కూడా మంచి స్పిన్నర్​. స్పిన్​కు సహకరించని ఆస్ట్రేలియా పిచ్​లపై లియాన్ బాగా రాణిస్తున్నాడు. అయితే అశ్విన్ దిగ్గజంలా మారతాడు. మున్ముందు మరిన్ని వికెట్లు తీసుకునేందుకు ఫిట్​నెస్​ను మెరుగుపరుచుకోవాలి. ప్రపంచంలోనే అత్యధిక వికెట్ల రికార్డును తిరగరాసే సత్తా అశ్విన్​లో ఉంది' అని హర్భజన్ జోస్యం చెప్పాడు.

పాకిస్థాన్ క్రికెటర్‌తో ఎఫైర్ అంటూ తమన్నాపై తప్పుడు ప్రచారం.!

Story first published: Thursday, May 7, 2020, 10:41 [IST]
Other articles published on May 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X