న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీతో స్మిత్‌కు పోలికా?: గంభీర్

Goutham Gambhir Says Virat Kohli is far better than Steve Smith in white ball cricket

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కన్నా కోహ్లీ బెటరని, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. అసలు వారిద్దరికీ పోలికే అనవసరమని అభిప్రాయపడ్డాడు. 'వైట్ బాల్ క్రికెట్ లో స్మిత్ కన్నా విరాటే బెటర్. వారిద్దరికీ పోలీకే లేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో నేనైతే వారిని పోల్చి చూడను. కానీ స్మిత్ ఏ స్థానంలో బ్యాటింగ్ వస్తాడో చూడాలనుకుంటున్నా.'అని మంగళవారం జరగనున్న ఇండియా- ఆస్ట్రేలియా వన్డే నేపథ్యంలో గంభీర్ బ్రాడ్ కాస్టర్ చానెల్ తో చెప్పుకొచ్చాడు.

ఒకవేళ స్మిత్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే లబూషేన్‌ నాల్గో స్థానంలో వస్తాడని, అలా కాకుండా లబూషేన్‌ను ముందుకు ప్రమోట్‌ చేస్తే స్మిత్‌ నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. ఇక కోహ్లీ వన్డేల్లో 11వేలకు పైగా పరుగులు చేయగా.. స్మిత్ 3810 పరుగులే చేశాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఈ ఇద్దరు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

<strong>న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. శాంసన్‌పై వేటు.. భారత జట్టు ఇదే!!</strong>న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. శాంసన్‌పై వేటు.. భారత జట్టు ఇదే!!

బుమ్రా, షమీ ఇబ్బంది పెడ్తారు..

బుమ్రా, షమీ ఇబ్బంది పెడ్తారు..

భారత ప్రధాన పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీలపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.. ఈ జోడి కచ్చితంగా ఆసీస్‌ బ్యాటింగ్‌ను ముప్పు తిప్పలు పెడుతుందని జోస్యం చెప్పాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో వీరిద్దరూ ఎలా బౌలింగ్‌ చేస్తారో అని ఆతృతగా ఉందన్నాడు. ప్రధానంగా ఆసీస్‌ ప్రధాన బ్యాట్స్ మెన్ డేవిడ్‌ వార్నర్‌, అరోన్‌ ఫించ్‌లను ఎలా కట్టడి చేస్తారో చూడాలని ఉందన్నాడు. మంచి పేస్ ఉన్న ఈ ఇద్దరు పిచ్ సహకారంతో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అదో పనికిమాలిన నిర్ణయం..

అదో పనికిమాలిన నిర్ణయం..

వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో మహ్మద్ షమీని ఆడించకపోవడాన్ని ఓ పనికిమాలిన నిర్ణయంగా గంభీర్ అభివర్ణించాడు. అద్భుత ఫామ్ లో ఉన్న అతన్ని ఆడించకపోవడం చెత్త నిర్ణయమేనని చెప్పుకొచ్చాడు. బెంగళూరు, వాంఖడే వంటి చిన్న మైదానాల్లో ఆడుతున్నప్పుడు బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ గా ఉండాలన్నాడు. అయితే షమీ వంటి బౌలర్ జట్టులో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశమన్నాడు.గాయం నుంచి రి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా సైతం క్వాలిటీ బౌలరేనని తెలిపాడు. ఈ ఇద్దరు ఆసీస్ ను ఇబ్బంది పెడ్తారన్నాడు.

మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్న స్మిత్.. కారణం ఇదే?!!

మిడిలార్డర్ ఎలా ఆడుతుందో..

మిడిలార్డర్ ఎలా ఆడుతుందో..

బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న భారత్ కు మిడిలార్డర్ ఎలా ఆడుతుందోననేది ఒక్కటే కలవరపెట్టే అంశమని, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారోననేది పరిశీలించాల్సిన అంశమని గంభీర్ తెలిపాడు. బలమైన ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కోహ్లీ సేనకు కష్టమేనన్నాడు. వీరిని ఎదుర్కోవడం బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడినంత సులవుకాదన్నాడు. గతేడాది పర్యటనలో ఇండియాను ఓడించిన ఆసీస్ జట్టులో మిచెల్ స్టార్క్, హజల్ వుడ్ లేరని, కానీ ఇప్పుడు ఉన్నారని, ఇండియా బ్యాటింగ్ కు ఈ సిరీస్ సవాల్ తో కూడుకున్నదేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, January 13, 2020, 16:36 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X