Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్న స్మిత్.. కారణం ఇదే?!!

 India vs Australia: Steve Smith to Return To Bat At No.3 For ODI Series

ముంబై: జనవరి 14 నుండి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సరీస్‌ ప్రారంభం కానుంది. మంగళవారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ వన్డే కోసం ఇరు జట్లు వాంఖేడేలో తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది.

మారనున్న స్మిత్‌ బ్యాటింగ్ ఆర్డర్‌:

మారనున్న స్మిత్‌ బ్యాటింగ్ ఆర్డర్‌:

గతేడాది లాగానే భారత్‌ను సొంత గడ్డపై మట్టికరిపించాలని చూస్తున్న ఆసీస్.. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఆసీస్ గేమ్‌ ప్లాన్‌ను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా.. ఈ సిరీస్‌లో మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఒకవేళ వికెట్ త్వరగా పడితే కీలక భాగస్వామ్యాలు నమోదు చేసేందుకు స్మిత్‌ను మూడో స్థానంలో పంపేందుకు రంగం సిద్ధం చేశారు.

వన్డే ఫార్మాట్‌లో 3,810 పరుగులు:

వన్డే ఫార్మాట్‌లో 3,810 పరుగులు:

2018 నుంచి స్మిత్‌ ఎక్కువగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. అయితే గతంలో మూడో స్థానంలో ఆడిన స్మిత్‌ను అదే స్థానంలో పంపాలనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే నిర్ణయించింది. స్మిత్‌ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకూ 8 సెంచరీలు, 23 హాఫ్‌ సెంచరీలతో 3,810 పరుగులు చేసాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 164. యావరేజ్ (41.41) కూడా బాగానే ఉంది.

నాలుగో స్థానంలో లబూషేన్‌:

నాలుగో స్థానంలో లబూషేన్‌:

టెస్ట్ ఫార్మాట్‌లో అదరగొట్టిన మార్నస్ లబూషేన్‌ ఈ సిరీస్‌తో వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. స్మిత్‌ తర్వాత స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. మూడో స్థానంలో స్మిత్‌ను పంపితే.. నాలుగో స్థానంలో లబూషేన్‌కు అవకాశం ఇవ్వొచ్చని ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. స్మిత్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడానికి ఇది కూడా ఒక కారణం.

 ఆసీస్ సిరీస్ గెలుస్తుంది:

ఆసీస్ సిరీస్ గెలుస్తుంది:

తాజాగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పలు విషయాలపై చర్చించాడు. ఈ సిరీస్‌లో ఎవరు గెలుస్తారని ఒక నెటిజన్‌ అడగగా... 'తాజా టెస్టు సిరీస్‌ల విజయాలతో ఆస్ట్రేలియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అయితే, గతేడాది ఐదు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఈ సారి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆస్ట్రేలియా 2-1 తేడాతో విజయం సాధిస్తుందని భావిస్తున్నా' అని పాంటింగ్‌ సమాధానం ఇచ్చాడు.

Story first published: Monday, January 13, 2020, 13:40 [IST]
Other articles published on Jan 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+