న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దురభిప్రాయాలకు చికిత్స లేదు.. అఫ్రిదిపై మండిపడ్డ భారత మాజీ క్రికెటర్

Former India cricketer Aakash Chopra responds to Shahid Afridi’s ‘Indians asked for forgiveness’ remarks

న్యూఢిల్లీ: పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన ప్రతీసారి భారత ఆటగాళ్లు తమకు క్షమాపణలు చెప్పేవారని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. కరోనాతో అఫ్రిదికి ఉన్న మతిపోయినట్లుందని ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. భారత్ అంటేనే ద్వేషం పెంచుకున్న ఈ పాక్ మాజీ కెప్టెన్.. వీలుచిక్కినప్పుడుల్లా విషం చిమ్ముతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాము కాటుకు చికిత్స..

పాము కాటుకు చికిత్స..

ఇక తాజాగా భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా.. అఫ్రిది వ్యాఖ్యలపై స్పందించాడు. పాము కాటుకు కూడా చికిత్స ఉందని, కానీ దురభిప్రాయాలకు మాత్రం లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. భారత్-పాక్ మ్యాచ్ గణంకాలు పరిశీలిస్తే అఫ్రిది వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన చోప్రా.. అఫ్రిది ఆడే సమయంలో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయని గణంకాలతో సహా వివరిస్తూ స్పష్టం చేశాడు.

ఒకప్పుడు పాక్ ఆధిపత్యం వాస్తవమే..

ఒకప్పుడు పాక్ ఆధిపత్యం వాస్తవమే..

‘ఒకప్పుడు భారత్‌పై పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించిన మాట వాస్తవం. ఇప్పటికీ ఆ జట్టు ఆటతీరు పర్వాలేదు. ఇక షార్జా వేదికగా ఆడిన సమయంలో పాక్ జట్టే భారత్ కన్నా బలంగా ఉండేది. కానీ అఫ్రిది ఆడే కాలంలో మాత్రం కాదు. ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌లు ఉన్న కాలంలో ఆ జట్టు ఆట అద్భుతంగా ఉండేది. వారున్నప్పుడు పాక్ చేతిలో భారత్‌ చాలా సార్లు ఓడింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అఫ్రిది ఆటను ప్రారంభించినప్పటి నుంచి వీడ్కోలు పలికే వరకు పరిస్థితులు పూర్తిగా మారాయి.

నమశక్యంగా లేవు..

నమశక్యంగా లేవు..

అఫ్రిది ఆడిన కాలంలో ఇరు దేశాల గణంకాలు పరిశీలిస్తే.. 15 టెస్ట్‌లు జరగ్గా.. ఇరు జట్లు చెరో ఐదు మ్యాచ్‌లు గెలిచాయి. వన్డేల్లో మనకన్నా వారు రెండు మ్యాచ్‌లు ఎక్కువగా గెలిచారు. 82 మ్యాచ్‌ల్లో వారు 41 గెలుపొందగా.. భారత్ 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం తమకన్నా రెండు మ్యాచ్‌లు ఎక్కువ గెలిచిన జట్టుకు భారత్ ఆటగాళ్లు క్షమాపణలు చెబుతారా? అనేది నా సందేహం.

ఇక టీ20ల విషయానికొస్తే భారత్‌దే పైచేయి. ఇరు జట్లు 8 సార్లు తలపడగా ఏడు సార్లు మనమే గెలిచాం. ఇవన్నీ చెప్పకుండా అఫ్రిది ఇంకేదో మాట్లాడాడు. అతని మాటలతో ఆశ్చర్యపోయా. ఇక పెద్దలు ఎప్పుడు చెబుతుంటారు.. పాము కాటు చికిత్స ఉంది. కానీ దురభిప్రాయాలకు లేదని. ఇది అఫ్రిదికి కూడా వర్తిస్తుంది.

ఇప్పుడు చాలా తేడా..

ఇప్పుడు చాలా తేడా..

ఇక అఫ్రిది ఆడే సమయంలో ఇరు జట్లు సమఉజ్జీలుగానే ఉన్నా.. మెళ్లగా భారత జట్టు ఆధిపత్యం పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక ప్రపంచకప్ గణంకాలు పరిశీలిస్తే భారత్‌దే పూర్తి ఆధిపత్యం. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడినా.. లీగ్ స్థాయిలో గెలిచింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను భారత్ ఓడించగా.. పాకిస్థాన్ మాత్రం ఆ జట్టు చేతిలో చిత్తయింది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య చాలా తేడా ఉంది'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఆ కారణంతోనే టీమిండియా హెడ్ కోచ్ పదవిని ద్రవిడ్ తిరస్కరించాడు

Story first published: Monday, July 6, 2020, 19:10 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X