న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నల్లోడా అని పిలిచిందెవరో వారికి తెలుసు.. పేర్లు బయట పెట్టకముందే క్షమాపణలు చెప్పండి: డారెన్ సామీ

Darren Sammy demands apology from his ex-SRH teammates

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా తాను జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్‌ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలను బీసీసీఐతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీనియర్ అధికారి, మాజీ ఆటగాళ్లు ఖండించారు. సామీపై చేసిన వర్ణ వివక్ష తమ దృష్టికి రాలేదన్నారు.

అయితే తనను నల్లోడా అని పిలిచిన ఆటగాళ్లు ఎవరో వారికి తెలుసని, వాళ్లంతట వాళ్లే తనకు క్షమాపణలు చెప్పాలని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ద్వారా సామీ డిమాండ్ చేశాడు.

మిన్వాజ్ మాటల్లో అర్థమైంది..

మిన్వాజ్ మాటల్లో అర్థమైంది..

‘సంస్కృతంలో నల్లజాతీయులను ఎలా వర్ణిస్తారనే దాని గురించి అమెరికన్ కమెడియన్ హసన్ మిన్వాజ్ మాట్లాడటం నేను విన్నాను. అతని నోట వచ్చిన పదం వినగానే నేను అవమానానికి గురయ్యాననే విషయం అర్థమైంది. చాలా ఆగ్రహం కలిగింది. వెంటనే నాకు 2013,2014 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన క్షణాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు నా సహచర ఆటగాళ్లు నన్ను పిలిచిన పదం అదేనని, మిన్వాజ్ దాని గురించే వివరించాడని బోధపడింది. అది మా నల్లజాతీయులను కించపరిచే పదమని తెలిసింది.

అప్పట్లో అర్థం తెలియక..

అప్పట్లో అర్థం తెలియక..

ఇక నన్ను నల్లోడా (కాలు) అని పిలిచిన వ్యక్తులు ఎవరో వారికి తెలుసు. త్వరలోనే వారికి నేను మెసేజ్ కూడా చేస్తా. నన్ను నల్లోడా అని పిలిచామని ఒప్పుకోవాలి. అప్పట్లో దాని అర్థం తెలియకపోవడంతో నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. కాలు అంటే బలమైన వ్యక్తి అని భావించి, నన్ను ఉత్సాహపరిచేందుకు అలా పిలుస్తున్నారని భావించా. నన్ను, తిసారా పెరెరాను ఎప్పుడూ ఆ పదంతోనే పిలిచేవారు. నవ్వుకునే వారు. ఏదో సరదా సంభాషణతో వారంత నవ్వుతున్నారనుకునేవాడిని. కానీ అప్పుడే ఇది ఫన్ కాదు.. మమ్మల్ని అవమానిస్తున్నారనే విషయం మాకు తెలిసి ఉంటే.. మా ఈ అసహనాన్ని, కోపాన్ని అర్థం చేసుకునేవారు.

క్షమాపణలు చెప్పండి..

ఇక నన్ను, తిసారాను పదే పదే ఆ పేరుతో పిలిచి, అదే మా పేరు అని చెప్పి మమ్మల్ని అవమానపర్చాలనుకున్నారా? ఈ విషయంపై మీకు మేసేజ్ కూడా చేస్తాను. జట్టుగా ఉండేందుకు నేనేప్పుడు కృషి చేసేవాడిని. నన్ను నల్లోడా అని పిలిచినవారెవరో మీకు తెలుసు. మీలో కొందరి వద్ద నా మెబైల్ నంబర్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలో కూడా టచ్‌లో ఉన్నారు. రండి నాతో మాట్లాడండి. ఈ విషయంపై చర్చిద్దాం. మిన్హాజ్ వివరణతో నేను చాలా బాధపడ్డాను. చాలా ఆగ్రహానికి గరయ్యాను. వెంటనే నాకు క్షమాపణలు చెప్పండి.'అని ఆ వీడియోలో సామీ డిమాండ్ చేశాడు.

సమాధానం చెప్పండి..

సమాధానం చెప్పండి..

ఇక ఈ వీడియోకు క్యాప్షన్‌గా తనను నల్లోడా అని పిలిచిన వారంతా తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని పేర్కొన్నాడు.‘జ్ఞానం అనేది ఓ శక్తి. నన్ను పిలిచిన ఓ పదానికి ఇటీవలే సరైన అర్థం తెలుసుకున్నా. అలా పిలిచిన వారందరితో నేను మాట్లాడాలనుకుంటున్నా. వారి నుంచి నాకు కొన్ని సమాధానాలు కావాలి. అ పదానికి మరో అర్థం ఉందని, ప్రేమతోనే పిలిచామనే మాటలు వారి నోటి నుంచి వినాలి'అని సామీ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2013, 201 సీజన్లలో హైదరాబాద్‌కు ఆడిన సామీ.. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడాడు. మొత్తం 22 మ్యాచ్‌లు ఆడిన సామీ 295 పరుగులతో 11 వికెట్లు పడగొట్టాడు.

అత్యాచార ఆరోపణలతో ప్రతీ ఒక్కరు నన్ను అనుమానించారు: అక్తర్

Story first published: Tuesday, June 9, 2020, 15:03 [IST]
Other articles published on Jun 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X