Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్యాచార ఆరోపణలతో ప్రతీ ఒక్కరు నన్ను అనుమానించారు: అక్తర్

Shoaib Akhtar recalls the time when he was wrongfully accused of sexual assault

కరాచీ: 2005 ఆస్ట్రేలియా పర్యటనలో తన సహచర ఆటగాడి కారణంగా తాను అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నానని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. సదరు ఆటగాడి పేరును పాక్ టీమ్‌మేనే‌జ్‌మెంట్ దాచిపెట్టడంతో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ప్రతీ ఒక్కరు తనను అనుమానించారని ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్ గుర్తు చేసుకున్నాడు. ఆ క్రికెటర్ పేరు చెప్పకున్నా.. పర్లేదు కానీ దయచేసి అక్తర్‌కు సంబంధంలేదని చెప్పండని టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కోరానని చెప్పుకొచ్చాడు.

షోయబ్‌కు సంబంధం లేదని చెప్పండి..

షోయబ్‌కు సంబంధం లేదని చెప్పండి..

సోమవారం హాలోయాప్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేసిన అక్తర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘పాకిస్థాన్ జట్టులోని అబ్బాయి ఓ బాలికను అపార్దం చేసుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. అతను చేసిన పనిని పాక్ టీమ్‌మేనేజ్‌మెంట్ దాచిపెట్టింది. దాంతో నాపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ప్రతీ ఒక్కరూ నన్నే అనుమానించారు. ఆ బాలుడి పేరు చెప్పకున్నా పర్లేదు కానీ.. కనీసం ఆ ఘటనతో షోయబ్‌కు సంబంధం లేదని ప్రకటించండని టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కోరా'అని అక్తర్ గుర్తు చేసుకున్నాడు.

మరో బోల్డ్ వీడియోతో రెచ్చిపోయిన షమీ వైఫ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

https://telugu.mykhel.com/cricket/mohammed-shami-s-wife-hasin-jahan-gets-criticised-after-sheres-party-video-028526.html

భారత పర్యటన కోసమే..

భారత పర్యటన కోసమే..

ఇక ఈ ఆరోపణలతోనే పీసీబీ అక్తర్‌ను అర్దాంతరంగా వెనక్కు రప్పించింది. అయితే భారత పర్యటన కోసం పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకే అక్తర్‌ను వెనక్కు రప్పించినట్లు ప్రకటించింది. ఈ ఘటనపై బాధితులరాలు, పోలీసుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంది. అంతేకాకుండా అంతర్గత విచారణ కూడా జరపలేదు. 2005 ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ టూర్ అనంతరం పాక్ జట్టు భారత్‌లో పర్యటించింది.

 సీనియర్ ఆటగాళ్లతో గొడవపడ్డా..

సీనియర్ ఆటగాళ్లతో గొడవపడ్డా..

తనకు కోపం ఎక్కువని, జట్టులో సీనియర్ ఆటగాళ్లతో చాలా సార్లు గొడవపడ్డానని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఓ విషయంలో యూనిస్ ఖాన్‌తో కూడా వాగ్వాదానికి దిగినట్లు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ గుర్తు చేసుకున్నాడు. 1999-2000లో జట్టులోని ఓపెనర్‌తో సహా ఆరుగురు ఆటగాళ్లు తనని కొట్టారని, ‘అసలు నీ గురించి ఏం అనుకుంటున్నావ్?'అని మందలించారని తెలిపాడు. మీడియా, అమ్మాయిలు పాకిస్థాన్ ఆటగాళ్ల పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారని చెప్పారని అక్తర్ గుర్తు చేసుకున్నాడు.

ఆ విషయంలో అపార్థం చేసుకున్నారు..

ఆ విషయంలో అపార్థం చేసుకున్నారు..

తన జీవితంలో తానెప్పుడూ జాత్యాహంకారానికి గురవ్వలేదని అక్తర్ స్పష్టం చేశాడు. కాకపోతే కోల్‌కతా వేదికగా జరిగి ఓ మ్యాచ్‌లో సచిన్ రనౌట్ విషయంలో అభిమానులు తనను తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. 2004లో భారత అభిమానులతో వల్ల జాతి వివక్ష ఎదుర్కొంటానని భావించానని, కానీ అది ఎప్పుడూ జరగలేదన్నాడు. తనకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన అక్తర్.. 300 వికెట్లు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, కానీ మోకాళ్లు సహకరించకపోవడంతో దానిని సాధించలేకపోయానని చెప్పుకొచ్చాడు.

నార్త్ ఇండియన్స్ చేతిలో సౌత్ ఆటగాళ్లు వర్ణ వివక్ష ఎదుర్కొంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్

Story first published: Tuesday, June 9, 2020, 13:07 [IST]
Other articles published on Jun 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+