ధోనీలో జట్టును గెలిపించే ఉద్దేశమే లేదు.. ఆటలో అసలు తీవ్రతే కనిపించలేదు: బెన్‌స్టోక్స్

లండన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటలో అసలు తీవ్రతే కనిపించలేదు అని ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. భారీ లక్ష్య ఛేదనలో జట్టును గెలిపించే ఉద్దేశంతో ధోనీ కనిపించలేదని పేర్కొన్నాడు. అదే మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ భాగస్వామ్యం విస్మయపరిచిందన్నాడు. స్టోక్స్ త్వరలో ఆవిష్కరించనున్న 'ఆన్‌ఫైర్' అనే పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించాడు.

ధోనీలో జట్టును గెలిపించే ఉద్దేశమే లేదు:
'లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైనప్పుడు ఎంఎస్ ధోనీ క్రిజులోకి వచ్చాడు. అప్పుడు అతడి ఆటలో అసలు తీవ్రతే కనిపించలేదు. సిక్సర్లు బాదడం కన్నా.. సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి సారించడం నన్ను ఆశ్చర్యపరిచింది. రెండు ఓవర్లు మిగిలున్నప్పుడు కూడా భారత్‌కు గెలుపుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి. ధోనీ భాగస్వామి కేదార్ జాదవ్‌లోనూ తీవ్రత కనిపించలేదు. నా వరకైతే విరుచుకుపడితేనే గెలుపుకు అవకాశాలు ఉంటాయి' అని స్టోక్స్ 'ఆన్‌ఫైర్' పుస్తకంలో రాశాడు.

కోహ్లీ-రోహిత్ భాగస్వామ్యం విస్మయపరిచింది:
'ధోనీ ఎప్పుడూ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉండి గెలిపించాలనుకుంటాడు. ఓడిపోయే మ్యాచ్‌ల్లోనే మహీ చివరి వరకు నిలిచి లక్ష్యానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాడు. కీలక సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భాగస్వామ్యం విస్మయపరిచింది. 27 ఓవర్లు క్రీజులో నిలిచి 138 పరుగులు మాత్రమే జోడించారు. మేం చాలా తెలివిగా బౌలింగ్ చేశామని తెలుసు. కానీ వారు బ్యాటింగ్ చేసిన విధానం మాత్రం విచిత్రంగా ఉంది. ఇద్దరు ఏమాత్రం గొప్పగా ఆడలేదు. వారు మాపై ఏ మాత్రం ఒత్తిడి పెంచే ఉద్దేశంతో కనిపించలేదు. దాంతో ఆట మా వైపు మళ్లింది' అని స్టోక్స్ పేర్కొన్నాడు.

కోహ్లీ బౌండరీ గురించి మాట్లాడటం విచిత్రం:
బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ ముగిశాక కెప్టెన్ విరాట్ కోహ్లీ 59 మీటర్ల బౌండరీ సరిహద్దుల గురించి మాట్లాడటం విచిత్రంగా అనిపించిందని స్టోక్స్ అన్నాడు. 'మ్యాచ్ ముగిశాక ఓ కెప్టెన్ బౌండరీ సరిహద్దుల గురించి మాట్లాడం ఆశ్చర్యంగా అనిపించింది. మైదానం ఎలా ఉన్నా రెండు జట్లకూ ఒకేలా ఉంటుంది కదా. అందులో అసలు ఇబ్బంది ఏముంటుంది' అని స్టోక్స్ 'ఆన్‌ఫైర్' పుస్తకంలో చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications