న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుడ్‌బై చెబుతుంటే గుండెల్లో గుచ్చినట్టైంది: బెన్ స్టోక్స్

 Ben Stokes tells Saying goodbye to my dad, mum and brother was tough

దుబాయ్: తన తల్లిదండ్రులకు గుడ్‌బై చెబుతుంటే గుండెల్లో గుచ్చినట్టైందని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. తండ్రి అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా స్టోక్స్.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్‌కి చేరుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టోక్స్.. తన తల్లిదండ్రులను అలా వదిలి రావడంపై ఓ చానెల్‌తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఓవైపు బాధ మరోవైపు సంతోషం..

ఓవైపు బాధ మరోవైపు సంతోషం..

'మనకు నచ్చిన వారిని వదిలిరావడం అనేది ఎంతో కష్టంగా ఉంటుంది. ఐపీఎల్‌ ఆడడానికి వచ్చే ముందు ఎయిర్‌పోర్ట్‌లో నా తండ్రి, తల్లి, సోదరుడికి గుడ్‌బై చెప్పడంలో చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. కరోనా కాలంలో నా తల్లిదండ్రుల వద్ద మంచి టైమ్ స్పెండ్‌ చేశాను.. ఐపీఎల్‌ కోసం ఈ సమయంలో వారిని వదిలిపెట్టి రావడంపై నాకు బాధగా ఉన్నా మరోవైపు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వెళ్తున్నది నాకు ఇష్టమైన ఆట దగ్గరికి.. దీనికి నా కుటుంబసభ్యులు కూడా అడ్డుచెప్పలేరు. ఇంతకాలం వారితో కలిసి ఉన్నా అనే ఒక్క ఫీలింగ్‌ బాధ కలిగేలా చేస్తుంది.

వారి ఆశీర్వాదంతోనే..

వారి ఆశీర్వాదంతోనే..

నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన ప్రారంభంలో ఒక వారంపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత వారితో కలిసి ఎన్నో మధురక్షణాలు గడిపాను. క్యాన్సర్‌తో బాధపడుతున్న నా తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నాను. కానీ ఐపీఎల్‌కు వెళ్లే సమయం రావడంతో నా తండ్రికి, తల్లికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కానీ వారు ఇచ్చిన ఆశీర్వాదంతోనే దుబాయ్‌లో అడుగుపెట్టా. రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా' అని ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.

స్టోక్స్ తండ్రికి క్యాన్సర్

స్టోక్స్ తండ్రికి క్యాన్సర్

ఇక స్టోక్ తండ్రి క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ నుంచి స్టోక్స్ అర్థాంతరంగా తప్పుకున్నాడు. హుటాహుటిన న్యూజిలాండ్ వెళ్లాడు. తండ్రి వద్దనే ఉంటూ ఇంగ్లండ్ ఆడిన తదుపరి సిరీస్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ ఐపీఎల్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఆరంభ మ్యాచ్‌లకు దూరమైనా.. స్టోక్స్ ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ చేరుకున్నాడు. న్యూజిలాండ్‌ దేశస్తుడైన స్టోక్స్‌.. ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

స్టోక్స్‌పైనే రాజస్థాన్ ఆశలు..

స్టోక్స్‌పైనే రాజస్థాన్ ఆశలు..

ఇక స్టోక్స్ రాకతో రాజస్థాన్ రాయల్స్ బలం పెరిగింది. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన రాజస్థాన్‌ తర్వాత హ్యాట్రిక్‌ ఓటములతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఈ దశలో అక్టోబర్‌ 11న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో స్టోక్స్‌ ఆడే అవకాశం ఉంది. స్టోక్స్ రాకతోనైనా రాజస్థాన్ రాయల్స్ రాత మారుతుదో లేదో చూడాలి. వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టిన స్టోక్స్.. దుబాయ్‌లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఇంగ్లండ్ వరల్డ్ కప్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

సంజూ శాంసన్‌ది మళ్లీ అదే కథనా? ఈ సీజన్‌లో కూడా అదే రిపీట్ అవుతుందా?

Story first published: Wednesday, October 7, 2020, 17:23 [IST]
Other articles published on Oct 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X