Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజూ శాంసన్‌ది మళ్లీ అదే కథనా? ఈ సీజన్‌లో కూడా అదే రిపీట్ అవుతుందా?

Is the Sanju Samson tale following a similar script in IPL 2020 as well?

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ మళ్లీ అదే కథను పునరావృతం చేయనున్నాడా? అంటే అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ ప్రారంభ మ్యాచ్‌లోనే సిక్సర్లతో విరుచుకుపడిన శాంసన్.. రాజస్థాన్‌కు శుభారంభం అందించాడు. 32 బంతుల్లోనే 9 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఆ వెంటనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి చెలరేగి 85 పరుగులతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.

ఈ రెండు ఇన్నింగ్స్‌లతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. సంజూ శాంసన్ కొత్తగా కనిపిస్తున్నాడని, త్వరలోనే ధోనీ వారసుడిగా భారత జట్టులోకి వస్తాడని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై తానేమి మారలేదని చెప్పకనే చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించిన శాంసన్.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో కలిపి 12 పరుగులే చేశాడు. ఫలితంగా రాజస్థాన్ హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది. ఇక శాంసన్‌ను మెచ్చుకున్నవారంతా ఇప్పుడు ముఖం చాటెస్తున్నారు.

శాంసన్‌కు ఇది కొత్తకాదు..

శాంసన్‌కు ఇది కొత్తకాదు..

ఐపీఎల్‌లో శాంసన్‌కు ఇది కొత్త కాదు. గత రెండు సీజన్లలో కూడా ఈ కేరళ బ్యాట్స్‌మెన్ ఇలాంటి ప్రదర్శననే కనబర్చాడు. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్ ఆడటం తర్వాత పత్తాలేకుండా పోవడం అతనికి అలవాటే. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనే భారీ సెంచరీతో చెలరేగిన శాంసన్(55 బంతుల్లో 102 నాటౌట్) ఇప్పటిలానే అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత పది మ్యాచ్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 8, 6, 31, 27, 35, 0, 22, 48 నాటౌట్, 28, 5తో విఫలమయ్యాడు. మళ్లీ సన్‌రైజర్స్‌తో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

2018లోనూ ఇదే కథ..

2018లోనూ ఇదే కథ..

ఇక 2018 సీజన్‌లోనూ శాంసన్ ఇదే వైఫల్యాన్ని కొనసాగించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 49, 37 ఫర్వాలేదనిపించిన ఈ కేరళ ఆటగాడు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మూడో మ్యాచ్‌లో (45 బంతుల్లో 92 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 7, 2తో రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన శాంసన్.. ముంబైపై(39 బంతుల్లో) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మళ్లీ ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు. 40, 3, 28, 22, 21, 26తో విఫలమయ్యాడు.

నిలకడనే అతిపెద్ద సమస్య..

నిలకడనే అతిపెద్ద సమస్య..

అపార ప్రతిభ కలిగిన శాంసన్‌కు నిలకడలేమి ఆటనే అతిపెద్ద సమస్యగా మారింది. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో చెలరేగడం.. ఆ తర్వాత దారుణంగా విఫలమవడంతో అతనిపై సెలెక్టర్లు పెద్దగా ఆసక్తికనబర్చడం లేదు. ఈ సమస్యను అధిగమిస్తేనే శాంసన్‌కు భారత జట్టులో అవకాశం లభిస్తుంది. లేకుంటే అతని ఆట ఐపీఎల్‌కే పరిమితం అవుతుంది. కనీసం ఈ సీజన్‌లోనైనా మిగతా మ్యాచ్‌ల్లో రాణిస్తే అతనికి, రాజస్థాన్‌కు మేలు జరుగుతుంది. మరి మిగతా మ్యాచ్‌ల్లోనైనా శాంసన్ చెలరేగుతాడా? లేక తన పాత కథనే రిపీట్ చేస్తాడా? చూడాలి.

శాంసన్ డకౌట్..

శాంసన్ డకౌట్..

ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శాంసన్ డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఓ చెత్త షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' సూర్య కుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 79 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా... రోహిత్‌ శర్మ (23 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం రాజస్తాన్‌ 18.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. జాస్‌ బట్లర్‌ (44 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. బుమ్రా (4/20) పదునైన బౌలింగ్‌లో దెబ్బ తీయగా... ప్యాటిన్సన్, బౌల్ట్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.

KKR vs CSK: కార్తీక్‌కు కఠిన పరీక్ష.. నెగ్గుతాడా? ధోనీ ముందు తేలిపోతాడా? తుది జట్లు ఇవే!

Story first published: Wednesday, October 7, 2020, 15:45 [IST]
Other articles published on Oct 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+