న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పుని ఒప్పుకోండి చర్యలు తీసుకోం.. ఫేక్ డాక్యుమెంట్స్‌పై ఆటగాళ్లకు బీసీసీఐ లాస్ట్ ఛాన్స్!

BCCI brings in additional measures to tackle age, domicile fraud in cricket

న్యూఢిల్లీ: ఫేక్ బర్త్‌డే సర్టిఫికేట్స్ విషయంలో ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆఖరి అవకాశం ఇచ్చింది. తప్పును ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ.. కొందరు ఆటగాళ్లు అండర్-19‌ వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ఈ నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల్ని సంబంధిత క్రికెట్ బోర్డులకి సమర్పిస్తూ లబ్ధి పొందుతున్నారు.

పాక్‌లో ఎక్కువ..

పాక్‌లో ఎక్కువ..

పాకిస్థాన్‌లో ఈ తరహా మోసం తరచూ వెలుగులోకి వస్తుండగా.. భారత్‌లో ఇప్పుడిప్పుడే కొన్ని కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ నడుంబిగించింది. ఇప్పటి వరకూ బీసీసీఐని మోసం చేసిన ఆటగాళ్లుఎవరన్నా ఉంటే తమ తప్పును ఒప్పుకోవాలని వారిని క్షమించి వదిలేయడమే కాకుండా.. అర్హులైన కేటగిరీలో మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.

కఠిన చర్యలు ఉంటాయి..

కఠిన చర్యలు ఉంటాయి..

‘ఎవరైనా ఫేక్ బర్త్‌డే సర్టిఫికేట్ సమర్పించి ఉంటే నిజాయితీగా బీసీసీఐ ముందు ఒప్పుకోవాలి. సెప్టెంబరు 15లోపు అలా ఒప్పుకున్న వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. అర్హతకు తగిన టోర్నీల్లో ఆడటానికి కూడా వీలు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లు తేలితే మాత్రం రెండేళ్ల నిషేధంతో పాటు.. రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ తరఫున కూడా ఆడించం'అని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ హెచ్చరించారు.

 ఫేక్ సర్టిఫికేట్స్‌తో..

ఫేక్ సర్టిఫికేట్స్‌తో..

దేశంలో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ.. అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు.. అండర్-16, అండర్-19 జట్లను ఎంపిక చేసి రెగ్యులర్‌గా టోర్నమెంట్‌లను ఆడిస్తుంటాయి. ఈ క్రమంలో సదరు ఆటగాళ్లు తమ జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కానీ అందులో వయసు తక్కువగా చూపించడం ద్వారా కొంత మంది లబ్ధి పొంది ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీంతో.. విచారణకు ఆదేశించిన బీసీసీఐ.. కొన్ని నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల్ని గుర్తించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడిన కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ రసిక్ సలామ్.. అండర్-19 నేషనల్ టీమ్‌లో ఆడేందుకు నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించి పట్టుబట్టాడు. దీంతో అతనిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ బోర్డు చర్యలు తీసుకుంది.

సరైన సమయంలోనే యువరాజ్‌సింగ్‌ను పక్కన పెట్టారు: మాజీ సెలెక్టర్

Story first published: Monday, August 3, 2020, 19:11 [IST]
Other articles published on Aug 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X