For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సరైన సమయంలోనే యువరాజ్‌సింగ్‌ను పక్కన పెట్టారు: మాజీ సెలెక్టర్

Former selector Roger Binny says It was the right time to drop Yuvraj Singh

న్యూఢిల్లీ: కెరీర్ చివరి దశలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన పట్ల దారుణంగా వ్యవహరించిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం భారత క్రికెట్‌కు అందించిన సేవలకు కనీస గౌరవం ఇవ్వలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. తనతో పాటు దిగ్గజ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ పట్ల బీసీసీఐ అన్‌ఫ్రొఫెషనల్‌గా వ్యవహరించిందని, తమ కోసం ఓ ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా ఆడించలేదని అసహనం వ్యక్తం చేశాడు.

కెరీర్ చరమాంకంలో..

కెరీర్ చరమాంకంలో..

అయితే ఈ వ్యాఖ్యలపై భారత మాజీ సెలెక్టర్ రోజర్ బిన్ని స్పందించాడు. సరైన సమయంలో యువరాజ్ సింగ్‌ను పక్కనపెట్టారని అభిప్రాయపడ్డాడు. 2012 నుంచి 2015 వరకు భారత సెలెక్టర్‌గా చేసిన రోజర్ బిన్ని.. తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ వ్యవహారంపై మాట్లాడాడు. కెరీర్ చివరి దశకు చెరేసరికి ఎవరైనా ఫిట్‌నెస్ కోల్పోతారని. అలాగే వారి ఆట కూడా మునపటిలా ఉండదన్నాడు. ‘కెరీర్ చివరి దశకు చేరే క్రమంలో.. ప్రారంభంలో ఆడినట్లు ఎవరూ ఆడరు. ఫిట్‌నెస్ లెవెల్స్ తగ్గుతాయి. గతంలో ఆడిన విధంగా ఆడలేరు. నాకు తెలిసి యువరాజ్ ఇంకొన్ని రోజులు ఆడాలనుకున్నాడు. అతనో అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడు. అతని శకంలో ప్రపంచ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అత్యద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడు. అయితే యువీని మాత్రం సరైన సమయంలోనే జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో మరో యువ ఆటగాడు అవకాశం దక్కించుకున్నాడు.'అని బిన్ని అభిప్రాయపడ్డాడు.

రెండు ప్రపంచకప్‌ల్లో..

రెండు ప్రపంచకప్‌ల్లో..

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. కెరీర్ చరమాంకంలో మాత్రం ఊహించని అవమానాలు ఎదుర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 362 పరుగులు, 15 వికెట్లు పడగొట్టిన యువరాజ్ సింగ్.. క్లిష్ట సమయాల్లోనూ సాహసోపేతంగా పోరాడి టీమిండియాకి విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు.

క్యాన్సర్‌తో..

క్యాన్సర్‌తో..

కానీ.. ఆ వరల్డ్‌కప్ తర్వాత క్యాన్సర్ బారిన పడిన యువీ.. కొన్నిరోజులు ఆటకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. మునుపటిలా ఆడలేకపోవడంతో అతనికి 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ చోటు దక్కలేదు. అయితే 2017లో సెంచరీతో మళ్లీ ఫామ్ అందుకున్నా.. గాయాలు యువీ కెరీర్‌ని దెబ్బతీశాయి. ముఖ్యంగా.. టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రవేశపెట్టిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో తొలుత ఫెయిలైన ఈ ఆల్‌రౌండర్.. కొన్ని రోజుల తర్వాత అందులో పాసైనా అప్పటికే ఆలస్యమైపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ టోర్నీ జరుగుతుండగానే యువీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పేశాడు.

మ్యాచ్ ఓడితే మాత్రం.. నీ తప్పుడు నిర్ణయమే కారణమని అంపైర్‌పై అరిచా: మాజీ క్రికెటర్

Story first published: Monday, August 3, 2020, 18:28 [IST]
Other articles published on Aug 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+