న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీతో వద్దు.. పాకిస్థాన్ దిగ్గజాలతో పోల్చండి: స్టార్ క్రికెటర్

Babar Azam Says Better if people compare me with Pakistan legends instead of Virat Kohli

మాంచెస్టర్‌: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఆ దేశ అభిమానులు ముద్దుగా 'పాకిస్థాన్ కోహ్లీ' అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. నిలకడకు మారు పేరైనా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటను బాబర్ పోలీ ఉండటంతోనే వారు అలా పిలుస్తుంటారు. అయితే కోహ్లీతో తనను పోల్చవద్దని ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసిన బాబర్.. తాజాగా భారత కెప్టెన్‌తో పోల్చడాన్ని పెద్దగా ఆస్వాదించనని తెలిపాడు.

పాక్ ప్లేయర్లు అయితేనే..

పాక్ ప్లేయర్లు అయితేనే..

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న బాబర్.. టెలీకాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీతో పోల్చడాన్ని ఎప్పుడూ గొప్పగా ఫీల్‌ కాలేదన్నాడు. దానికి బదులుగా పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్లు జావెద్‌ మియాందాద్‌, యూనిస్‌ ఖాన్‌, ఇంజమామ్ ఉల్‌ హక్‌లతో పోలిస్తే మరింత సంతోషిస్తానన్నాడు. ‘నన్ను ఎవరితోనైనా పోల్చినప్పుడు వారి పాకిస్తాన్‌ ప్లేయర్స్‌ అయితేనే నాకు నచ్చుతుంది. విరాట్‌తో పోలిక కంటే పాక్‌ దిగ్గజాలతో పోల్చినప్పుడు గౌరవంగా భావిస్తా. మాకు మియాందాద్‌, యూనిస్‌ ఖాన్‌, ఇంజమాముల్‌ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వారితో పోల్చండి.. అప్పుడు నాకు గొప్పగా అనిపిస్తుంది'అని బాబర్ అభిమానులకు సూచించాడు.

ఏమాత్రం సరితూగడు..

ఏమాత్రం సరితూగడు..

టీ20ల్లో అజామ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకులో ఉండగా, వన్డేల్లో విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ చేసిన పరుగులు.. అందుకున్న రికార్డులు, ఘనతలు చూస్తే.. బాబర్ అతనికి ఏమాత్రం సరితూగడు. అయినా కోహ్లీతో పోలీక వద్దని చెప్పడం క్రికెట్ అభిమానులను విస్మయపరుస్తుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇంకా భయాందోళనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్‌ జట్టు ఆశావహ దృక్పథంతో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్‌ బృందం మాంచెస్టర్‌లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆగస్టులో 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. పాక్‌ టెస్టు కెప్టెన్‌గా అజహర్‌ అలీ వ్యవహరించనున్నాడు.

టెస్ట్ సిరీస్ గెలవడమే మా లక్ష్యం..

టెస్ట్ సిరీస్ గెలవడమే మా లక్ష్యం..

ఇక ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం తమ ప్రథమ లక్ష్యమని టెస్ట్ వైస్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పష్టం చేశాడు. సొంతగడ్డపై ఆడటం ఆతిథ్య జట్టుకు కలసి వచ్చినా.. వారికి గట్టి పోటీనిచ్చేందుకు తమ బౌలర్లు సిద్దంగా ఉన్నారని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు. ‘గత ఇంగ్లండ్ పర్యటనలో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఈ నేపథ్యంలో మా ఆటగాళ్లు ఈ సిరీస్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పర్యటనలో టెస్ట్ సిరీస్ గెలవడమే మా ప్రథమ లక్ష్యం. సొంతగడ్డపై ఆడటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. కానీ మా బౌలర్ల నుంచి వారికి కఠిన సవాల్ ఎదురవుతోంది. వారి టాపార్డర్‌నే మేం టార్గెట్ చేస్తాం. అనుభవజ్ఞులైన మహ్మద్ అబ్బాస్, నజీమ్ షా, షాహిన్ అఫ్రిదీ వంటి ఆటగాళ్లతో మా జట్టు చాలా బలంగా ఉంది. మా బౌలర్లపై మేం భారీ అంచనాలు పెట్టుకున్నాం'అని బాబర్ తెలిపాడు.

 సహజంగా ఆడుతా..

సహజంగా ఆడుతా..

ఇక ఈ సిరీస్‌లో తన సహజసిద్దమైన ఆటతో రాణిస్తానని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు. అలా ఆడితేనే సెంచరీలను భారీ స్కోరర్లుగా మల్చవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘సహజసిద్దంగా ఆడితే సెంచరీలను, డబుల్ ట్రిపుల్‌గా మల్చవచ్చు. ఈ సిరీస్‌లో నేను చాలా సహజసిద్దంగా ఆడాలనుకుంటున్నా. ఇక షాట్ సెలెక్షన్ మాత్రం పరిస్థితులు, బౌలర్లపై ఆధారపడి ఉంటుంది.'అని తెలిపాడు. ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 45 సగటుతో పరుగులు చేశాడు.

రాంచీలో ధోనీ ఏదో చేశాడు.. లేకుంటే నెట్స్‌లో అలా ఎలా ఆడుతాడు: సీఎస్‌కే స్పిన్నర్

Story first published: Friday, July 3, 2020, 11:35 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X