న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్ జట్టులో నీ పాత్ర ఏంటో తెలుసుకో: రహానే

Ajinkya Rahanes advice to Rishabh Pant has to accept he is going through rough patch

వెల్లింగ్టన్‌: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ జట్టులో తన రోల్ ఏంటో తెలుసుకోవాలని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సూచించాడు. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రహానే మీడియాతో మాట్లాడుతూ.. ఏది జరిగినా పాజిటివ్‌గా ఉంటూ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడమే మనముందున్న కర్తవ్యమని గుర్తిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నాడు.

జూనియర్‌, సీనియర్‌ తేడా లేదు..

జూనియర్‌, సీనియర్‌ తేడా లేదు..

జట్టులో జూనియర్ సీనియర్ తేడా అనేది లేదని, జట్టు అవసరాలకు తగ్గట్టు సిద్ధమవ్వడమే ఆటగాళ్ల కర్తవ్యమని రహానే తెలిపాడు. ‘మనం ఏమి చేస్తున్నామో దాన్ని అంగీకరించడం అనేది చాలా ముఖ్యం. ఏది జరిగినా సానుకూల ధృక్పధంతో ఉండాలి. ప్రతీది నేర్చుకుంటూ ముందుకు సాగడమే ఆటగాడిగా మన కర్తవ్యం. ఇక్కడ జూనియర్‌, సీనియర్‌ అనే తేడా ఏమీ ఉండదు. తుది జట్టులో ఆడకుండా బయట కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఫలానా మ్యాచ్‌కు ఎలా సన్నద్ధం కావాలో దానిపై మాత్రమే టీమ్ మేనేజ్‌మెంట్‌ దృష్టిసారిస్తోంది. దాన్ని ఎవరైనా తప్పకుండా అంగీకరించాల్సిందే.'అని రహానే తెలిపాడు.

తొలి టెస్ట్ ప్రివ్యూ: ఓపెనర్లుగా మయాంక్-పృథ్వీషా.. పంత్‌కు నోచాన్స్.. తుది జట్టు ఇదే!!

పంత్ మరింత సానబెట్టాలి..

పంత్ మరింత సానబెట్టాలి..

జట్టులో వ్యక్తిగత ప్రదర్శన అనేది చాలా ముఖ్యమని, పంత్ ఆ దిశగా దృష్టిసారించాలని రహానే సూచించాుడ. ‘మన వ్యక్తిగత ప్రదర్శన అనేదే చాలా ముఖ్యం. మనం బాగా ఆడలేకపోతే స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకుని అందుకోసం సన్నద్ధం కావాలి. నీ ఆటను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడితే అవకాశం తప్పకుండా వస్తుంది. ముందు నీ రోల్‌ ఏమిటో తెలుసుకోవాలి. ఆరో, ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే రిషభ్‌ పంత్‌ తన పాత్ర ఏమిటో ఒకసారి విజువలైజ్‌ చేసుకోవాలి. అప్పుడు అతని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తన శక్తి సామర్థ్యాలపై పంత్‌ ఫోకస్‌ చేసి వాటికి మరింత సానబెట్టాలి ' అని రహానే సలహా ఇచ్చాడు.

వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు..

వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు..

ఇక యువ ఓపెనింగ్ జోడీ మాయంక్-పృథ్వీషాల గురించి మాట్లాడుతూ.. ‘ఇద్దరు యువ ఆటగాళ్లే. కానీ ఇద్దరూ సహజసిద్దమైన అటాకింగ్ కలిగిన ప్లేయర్లు. ఆటలో వారి అటిట్యూడ్ సూపర్. వారికి సలహా కాల్సిన స్థితిలో వారు లేరు'అని రహానే నయా ఓపెనింగ్ జోడీని కొనియాడాడు.

అనుపమా బర్త్‌డే.. బుమ్రా ట్వీట్.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్?

పంత్ డౌటే.!

పంత్ డౌటే.!

ఇక గతేడాది వరకూ టీమిండియా ‘ఫస్ట్‌ చాయిస్‌' వికెట్‌ కీపర్‌గా కొనసాగిన రిషభ్‌ పంత్‌.. గత కొంతకాలంగా రిజర్వ్‌ బెంచ్‌‌కే పరిమితమవుతున్నాడు. ముఖ్యంగా కివీస్ పర్యటనలో అతను ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. కేఎల్ రాహుల్ కీపింగ్ పుణ్యమా.. అని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఒక్క అవకాశం రాకపోగా.. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో వృద్ధిమాన్‌ సాహా రూపంలో పోటీ ఎదురువ్వనుంది. అత్యుత్తమ కీపింగ్‌ స్కిల్స్‌ ఉన్న సాహా వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపుతోంది. దీంతో పంత్ మళ్లీ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

Story first published: Thursday, February 20, 2020, 19:45 [IST]
Other articles published on Feb 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X