న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సౌతాఫ్రికాకు సారథ్యం వహించమంటున్నారు: డివిలియర్స్

AB de Villiers Says CSA has asked me to lead South Africa again

న్యూఢిల్లీ: తనను సౌతాఫ్రికా జట్టులోకి ఆహ్వానించడమే కాకుండా సారథ్య బాధ్యతలు కూడా చేపట్టమంటున్నారని ఆ దేశ దిగ్గజ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ తెలిపాడు. అభిమానులు ముద్దుగా మిస్టర్ 360గా పిలచుకునే ఈ క్రికెటర్ 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుంచి కేవలం టీ20 లీగుల్లోనే ఆడుతూ వచ్చాడు. అయితే గతేడాది వన్డే ప్రపంచకప్ ముందు రీఎంట్రీ చేయాలనుందని తన మనసులోని కోరికను ఈ మిస్టర్ 360 బయట పెట్టగా .. సెలెక్టర్లు అంగీకరించలేదు.

ప్రపంచకప్‌ కోసం ప్రయత్నాలు..

ప్రపంచకప్‌ కోసం ప్రయత్నాలు..

దానికి తగ్గట్టే ఆ మెగా టోర్నీలో సౌతాఫ్రికా ఘోర పరాభావానికి గురై తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లోపు జట్టులోకి ఏబీని తీసుకురావాలని గత కొంతకాలంగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు అతనితో సంప్రదింపులు జరపగా.. తనకు ఆడే సామర్థ్యం ఉంటేనే తిరిగి జట్టులోకి వస్తానని డివిలియర్స్ స్పష్టం చేశాడు. అంతేకాకుండా తన రీ ఎంట్రీపై లేనిపోని ఆశలు కల్పించనని పేర్కొన్నాడు.

అలా ఫీలైతేనే..

అలా ఫీలైతేనే..

ఇక తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. సౌతాఫ్రికా క్రికెట్ మేనేజ్‌మెంట్ జట్టులోకి ఆహ్వానించడమే కాకుండా సారథ్య బాధ్యతలు కూడా స్వీకరించాలని కోరిందన్నాడు.‘జట్టులోకి రమ్మని మాత్రమే కాకుండా మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాలని క్రికెట్ సౌతాఫ్రికా కోరింది. అయితే రీఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం నా సహచర ఆటగాళ్ల కంటే.. నేను మంచి ఫామ్‌లో ఉండాలి. అది చాలా ముఖ్యమైన విషయం. నేను మెరుగ్గా ఉన్నానని అనిపించిన రోజే జట్టులో సౌకర్యవంతంగా ఉండగలను. ఇన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నందున అందరి అంచనాలను చేరుకోగలను అనిపిస్తేనే.. మళ్లీ జట్టులోకి వెళతా' అని డివిలియర్స్ స్పష్టం చేశాడు.

ధోనీ మళ్లీ ఆడాలి.. అతని చివరి మ్యాచ్‌లో నేనుండాలి: యువపేసర్

ఆఖరి వరకు ఆర్సీబీలోనే..

ఆఖరి వరకు ఆర్సీబీలోనే..

కరోనా కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన డివిలియర్స్ ఇటీవలే.. తన సహచర ఐపీఎల్ ప్లేయర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్‌ ఆటగాళ్లు పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఆడినంత కాలం ఆర్‌సీబీ తరఫునే ఆడుతామన్నారు. అలాగే భారత్‌-దక్షిణాఫ్రికా సంయుక్త వన్డే జట్టును ఎంపిక చేసారు. ఈ జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోనీని కెప్టెన్‌గా నియమించారు. ఈ జట్టులో ధోనీ తమతో పాటు సచిన్ టెండూల్కర్‌, రోహిత్‌ శర్మ, జాక్వస్ కలిస్‌, యువరాజ్ సింగ్‌, యుజువేంద్ర చహల్‌, డేల్ స్టెయిన్‌, జస్ప్రీత్ బుమ్రా, కాగిసో రబాడ ఉన్నారు.

పేదల కోసం కిట్‌ల వేలం..

పేదల కోసం కిట్‌ల వేలం..

కరోనా వైరస్‌పై పోరాటంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ఈ ఇద్దరు సిద్ధమయ్యారు. 2016 ఐపీఎల్‌లో గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరు సెంచరీలు చేసినప్పటి జెర్సీలు, బ్యాట్లు, గ్లౌవ్స్‌ వేలం వేస్తామని ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్‌ 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కోహ్లీ 109 పరుగులు చేశాడు. పర్యావరణాన్ని ప్రోత్సహించే క్రమంలో ఆ రోజు ఆర్‌సీబీ గ్రీన్‌ జెర్సీలతో బరిలోకి దిగింది.

Story first published: Wednesday, April 29, 2020, 19:40 [IST]
Other articles published on Apr 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X