న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2020: అయ్యో సెరెనా.. ఈ సారి కూడా నిరాశేనా..!

Serena Williams Loses To Victoria Azarenka In US Open 2020 Semi-Finals

న్యూయార్క్‌: గత మూడేళ్లుగా ఆల్‌టైమ్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌-ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. కరోనా భయంతో టాప్ సీడ్ ఆటగాళ్ల గైర్హాజరీతో ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి రికార్డు సృష్టించాలనుకున్న ఈ నల్లకలువ ఆశలపై ప్రపంచ మాజీ నంబర్‌వన్‌, బెలారస్‌ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా నీళ్లు చల్లింది.

ఆరేళ్ల తర్వాత..

ఆరేళ్ల తర్వాత..

భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో విక్టోరియా అజరెంకా 1-6, 6-3, 6-3 తేడాతో సెరెనాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలిసెట్‌ను అజరెంకా భారీ తేడాతో కోల్పోయినా, మిగతా రెండు సెట్లలో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని తుదిపోరుకు సిద్ధమైంది. ప్రధాన టోర్నీల్లో సెరెనా తొలి సెట్‌ను గెలిచిన తర్వాత మ్యాచ్‌లో ఓడిపోవడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2014 వింబుల్డన్‌లో అలెజ్‌ కార్నెట్‌ చేతిలో సెరెనా ఇదే తరహాలో ఓటమి పాలైంది. అప్పుడు తొలి సెట్‌ను గెలిచి మిగతా రెండు సెట్లను సెరెనా కోల్పోయింది

 ఏడేళ్ల తర్వాత

ఏడేళ్ల తర్వాత

ఈ ఫలితంతో ఓ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో ఏడేళ్ల తర్వాత అజరెంకా ఫైనల్‌కు చేరింది. చివరిసారిగా 2013లో గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన అజరెంకా.. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ టైటిల్ ఫైట్ బెర్తును ఖాయం చేసుకుంది. 2012, 2013లలో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకొని రెండుసార్లూ సెరెనా చేతిలో ఓడి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్న అజరెంకా.. ఈసారి ట్రోఫికి అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ అజరెంకా, సెరెనా మధ్య 22 సార్లు ముఖాముఖి పోరు జరిగింది. 18 సార్లు సెరెనా... నాలుగుసార్లు అజరెంకా విజయం సాధించారు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో వీరిద్దరు 10 సార్లు తలపడగా... పదికి పది మ్యాచ్‌ల్లో సెరెనానే గెలుపొందింది.

బెలారస్‌ ‘మమ్మీ'..

బెలారస్‌ ‘మమ్మీ'..

2016 డిసెంబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా ఏడు నెలలపాటు ఆటకు విరామం ఇచ్చింది. 2017 జూలైలో వింబుల్డన్‌ టోర్నీ ద్వారా గ్రాండ్‌స్లామ్‌లలో పునరాగమనం చేసింది. ఆ తర్వాత ఆమె మరో ఏడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొన్నా మూడో రౌండ్‌ను దాటలేకపోయింది. యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తల్లిగా రికార్డు సృష్టించాలని ఈ బెలారస్‌ ‘మమ్మీ' ఉవ్విళ్లూరుతుంది.

ఒసాకాతో టైటిల్ ఫైట్

ఒసాకాతో టైటిల్ ఫైట్

మరో సెమీఫైనల్లో అమెరికా అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ జెన్నిఫర్‌ బ్రాడీని ఓడించిన జపాన్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకతో అజరెంకా అమీతుమీ తేల్చుకోనుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాక 7-6 (1), 3-6, 6-3తో ‌ జెన్నిఫర్‌ బ్రాడీపై పోరాడి గెలిచింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను ఒసాకా గెలుచుకోగా, రెండో సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఒసాకా తిరుగులేని తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

ఆర్‌సీబీ అత్యుత్సాహం.. కోహ్లీ మళ్లీ బౌలింగ్‌ చేయకుండా చితక్కొట్టిన సీఎస్‌కే!

Story first published: Friday, September 11, 2020, 11:12 [IST]
Other articles published on Sep 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X