For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్‌సీబీ అత్యుత్సాహం.. కోహ్లీ మళ్లీ బౌలింగ్‌ చేయకుండా చితక్కొట్టిన సీఎస్‌కే!

When Virat Kohli was hit for 28 runs in an over by Albie Morkel in 2012 IPL match

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ది బెస్ట్ టీమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచిన జట్టు.. అలాగే ప్రతీ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరిన టీమ్ ఏదైనా ఉందంటే అది సీఎస్‌కేనే. ఇప్పటికే మూడు టైటిల్స్ గెలుచుకున్న ఆ జట్టు ఐదు సార్లు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. మరో 9రోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 సీజన్‌లో టైటిల్ నెగ్గి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో నాలుగు సార్లు టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్‌ రికార్డును సమయం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా ధోనీ సేన కసరత్తులు చేస్తోంది.

కోహ్లీని చితక్కొటి..

కోహ్లీని చితక్కొటి..

అయితే చెన్నై పదేళ్ల ఐపీఎల్ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు.. మరెన్నో అద్భుత క్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం అభిమానులకు బాగా గుర్తుండిపోయింది. సీఎస్‌కే డైహార్డ్ ఫ్యాన్‌కు ఆ సంఘటన గురించి చెబితే నాటి మ్యాచ్ కళ్ల ముందు కదలాడుతుంటుంది. అదేంటంటే ప్రస్తుత టీమిండియా కెప్టెన్, ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీ బౌలింగ్‌ను చీల్చి చిండాడటం. అవును అతని బౌలింగ్‌లో సీఎస్కే బ్యాట్స్‌మన్ ఏకంగా 4 6 4 6 2 6తో వీరవిహారం చేసి 28 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌ను ఆర్‌సీబీ అభిమానులు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో వెటోరీ నేతృత్వంలోని ఆర్‌సీబీ గెలుపు ముంగిట బోర్లా పడింది. విరాట్ బ్యాట్స్‌మన్ కావడంతో బతికిపోయాడు కానీ.. బౌలర్ అయితే దాదాపు అతని కెరీర్ ముగిసేదని చెన్నై అభిమానులు నాటి మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ అభిప్రాయపడుతుంటారు.

 చెలరేగిన గేల్, కోహ్లీ..

చెలరేగిన గేల్, కోహ్లీ..

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్‌కే ముందు ఉంచింది. ఆర్‌సీబీలోని నాటి ఆటగాళ్లు క్రిస్ గేల్(68), విరాట్ కోహ్లీ(57) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. మయాంక్ అగర్వాల్(45) రాణించాడు. ఏబీ డివిలియర్స్(4) విఫలమయ్యాడు. చెన్నై జట్టులో డౌ బొల్లింగర్ మూడు వికెట్లు తీయగా.. అల్బీ మోర్కెల్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు.

12 బంతుల్లో 43 పరుగులు..

12 బంతుల్లో 43 పరుగులు..

అనంతరం లక్ష్య చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ డూప్లెసిస్ (71) ధాటిగా ఆడటంతో మంచి ఆరంభాన్నే అందుకుంది. కానీ వేగంగా ఆడే క్రమంలో సురేశ్ రైనా(23), ధోనీ(41) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీఎస్కే గెలవాలంటే 12 బంతుల్లో 43 పరుగులు అవసరం. ఈ పరిస్థితుల్లో ధోనీ సేన విజయం అసాధ్యమని అందరూ భావించారు. కానీ క్రీజులో ఉన్న అల్బె మోర్కెల్ సుసాధ్యం చేశాడు. గెలిచామనే అత్యుత్సాహంలో ఆర్సీబీ కెప్టెన్ వెటోరీ బంతిని విరాట్ కోహ్లీకి ఇచ్చాడు. ఇక అల్బీ మోర్కెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 28 రన్స్ పిండుకున్నాడు. ఒక్క ఐదో బంతి మినహా ప్రతీ బంతిని అతడు బౌండరీకి తరలించాడు.

చివరి ఓవర్‌లో వినయ్ కుమార్ తొలి బంతికే మోర్కెల్‌ను ఔట్ చేసి ఆశలు రెకెత్తించాడు. కానీ ఆ మరుసటి బంతికే నోబాల్ వేసి ఐదుగురు పరుగులు సమర్పించుకున్నాడు. ఆ మరుసటి బంతిని భారీ సిక్సర్ కొట్టి డ్వేన్ బ్రావో.. ఓ బంతి వృథా చేసి మరో బంతికి సింగిల్ తీసి జడేజాకు బ్యాటింగ్ ఇచ్చాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా జడేజా ఫోర్ కొట్టి అద్భుత విజయాన్నందించాడు.

వెటోరీ కెప్టెన్సీ లోపం..

వెటోరీ కెప్టెన్సీ లోపం..

ధోనీ సేనను అడ్డుకునే క్రమంలో ప్రధాన బౌలర్ల కోటా పూర్తయ్యేలా బౌలింగ్ చేయించిన వెటోరీ.. 19వ ఓవర్ కోహ్లీకి బంతి ఇచ్చి ఘోర తప్పిదం చేశాడు. ఆ సమయానికి రాజు బత్కల్, విరాట్ కోహ్లీ, వినయ్ కుమార్‌లే వెటోరికి బౌలింగ్ ఆప్షన్‌గా ఉన్నారు. బత్కల్ అప్పటికే దారళంగా పరుగులిచ్చుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక బంతిని వెటోరీ కోహ్లీ అప్పగించి మూల్యం చెల్లించుకున్నాడు. చివరి ఓవర్ వేసిన వినయ్ కుమార్‌తో 19వ ఓవర్ వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అప్పట్లో క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా సీఎస్కే ఐపీఎల్ ప్రయాణంలో ఈ మ్యాచ్ ఓ అద్భుత క్షణంగా మిగిలిపోగా.. ఆర్‌సీబీకి మాత్రం పీడకలగా నిలిచింది.

Story first published: Thursday, September 10, 2020, 16:16 [IST]
Other articles published on Sep 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+