న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Serena Williams: మా అక్కకు నాకు తేడా తెలియడం లేదా? ప్రముఖ పత్రికపై అమెరికా టెన్నిస్ స్టార్ ఫైర్!

Serena Williams calls out New York Times after newspaper mistakenly uses a picture of sister Venus

న్యూఢిల్లీ: ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్‌పై అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరింత మంచిగా వార్తలు రాయగలరని కౌంటరిచ్చింది. తన అక్క వీనస్ విలియమ్స్‌కు తనకు తేడా తెలియడం లేదా? అంటూ నిలదీసింది. సెరెనా విలియమ్స్‌కు సంబంధించి బుధవారం ప్రచురించిన ఓ వార్తలో న్యూయార్క్ టైమ్స్ ఘోర తప్పిదం చేసింది.

ఆమెకు బదులు తన సోదరి వీనస్ విలియమ్స్ ఫొటోను ప్రచురించింది. యుక్త వయసులో సెరెనా, వీనస్‌లు దాదాపు ఒకే రకంగా ఉండేవారు. అప్పటి సెరెనా అనుకొని.. వీనస్‌ ఫోటోను పబ్లిష్‌ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టికల్‌తో పాటు ఫోటోను ట్యాగ్‌ చేస్తూ సెరెనాకు పంపించారు. ఇది చూసిన సెరెనా సదరు పత్రికపై ఘాటుగా స్పందించింది.

'జీవితంలో చాలా సాధించినప్పటికి ఏదో తెలియని వెలితి మనల్ని నిరంతరం వెంటాడుతుంది. పక్షపాత ధోరణితో వ్యవస్థల ద్వారా వివక్షకు గురైన కొందరికి అండగా ఉండేందుకు సెరెనా వెంచర్స్‌ పేరుతో క్యాపిటల్‌ వెంచర్‌ను ప్రారంభించాను. దాని తరఫున 111 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల ఫండ్‌ను సమీకరించాను. సంస్థను నెలకొల్పిన వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు వ్యవస్థ సాయపడుతోంది. ఇదే విషయాన్ని ఒక పత్రిక ఆర్టికల్‌ రూపంలో రాసుకొచ్చింది. కానీ ఫోటో మాత్రం వేరొకరిది పెట్టింది. మా అక్క ఫోటో వాడటం తప్పు కాదు.. కానీ ఫోటో వేసేముందు ఒకసారి తీక్షణంగా పరిశీలిస్తే బాగుంటుంది. ఫోటోను పెట్టారు సరే.. కానీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. మీ పరిశోధన సరిపోలేదు..'' అంటూ రాసుకొచ్చింది.

మహిళల టెన్నిస్ విభాగంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన సెరీనా ఈ మధ్య టెన్నిస్‌లో అంత చురుగ్గా ఉండటం లేదు. గతేడాది వింబుల్డన్‌ పోటీల్లో తొలిరౌండ్‌లో ఓటమిపాలయ్యాక మళ్లీ రాకెట్‌ పట్టలేదు. ఇక జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ పాల్గొనలేదు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె టాప్‌ 50లో చోటు కోల్పోయారు. 2006 తర్వాత ఇలా జరగడం తొలిసారి.

Story first published: Thursday, March 3, 2022, 17:40 [IST]
Other articles published on Mar 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X