న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Novak Djokovic: సెర్బియా స్టార్‌కు మరో షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ కూడా

French Sports ministry says No vaccine, no Roland Garros for Novak Djokovic

పారిస్‌: వరల్డ్ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోకపోవడంతో అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి బహిష్కరణకు గురైన జకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడటంపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోకుంటే.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడనివ్వమంటూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

'నో వ్యాక్సిన్‌.. నో ఫ్రెంచ్‌ ఓపెన్‌. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్‌కు అయినా ఇదే రూల్‌. వ్యాక్సిన్‌ పాస్‌ రూల్‌ మేము అమలు చేయబోతున్నాం. ఇప్పటికే మాకు హెల్త్‌ పాస్‌ అనేది ఒకటి ఉంది. ఈ నిబంధనలకు ఎవరూ అతీతులు కాదు. అది ఏ రంగంలో సెలబ్రెటీకి అయినా వర్తిస్తుంది.'అని ఫ్రాంచ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మే 22వ తేదీ నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభం కానుంది.

ఇక వీసా అంశంలో జకోవిచ్‌కు ఆస్ట్రేలియా కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. దీంతో టైటిల్‌ నిలబెట్టుకోవాలన్న అతని ఆశలు ఆడియాశలయ్యాయి. కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో జకోవిచ్ ఆస్ట్రేలియాకు గడ్డపై అడుగుపెట్టాడు. అయితే వ్యాక్సినేషన్ లేకుంటే దేశంలోకి అనుమతించేది లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్ వీసాను రద్దు చేసింది.

అయితే, అతను కోర్టుకెక్కి విజయం సాధించాడు. కానీ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జకోవిచ్ రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతనికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్‌ పత్రాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాంతో జకోవిచ్ నిరాశగా తిరుగుపయనమయ్యాడు.

Story first published: Monday, January 17, 2022, 20:20 [IST]
Other articles published on Jan 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X