న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics: మూడో రోజు భారత షెడ్యూల్ ఇదే.. బరిలో సింధు, మేరీకోమ్!

What To Watch Today July 25 Tokyo Olympics Indian Schedule And Events
The History Of Olympic Games | Oneindia Telugu

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ రెండో రోజే భారత్ పతకాల ఖాతా తెరించింది. వెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కిలోల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌కు మిగతా క్రీడా విభాగాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌లో దేశీయ ఆటగాళ్లు సుమిత్ నాగల్‌, మనికా బాత్రా తొలి రౌండ్‌ నెగ్గగా.. ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పోరు ముగిసింది. బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. పురుషుల సింగిల్స్‌లో మాత్రం నిరాశే ఎదురైంది. షూటింగ్, బాక్సింగ్ ఈవెంట్స్‌లో కూడా చుక్కెదురైంది.

ఇక మూడో రోజు సైతం భారత్ పతకాలు గెలుచుకునే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న మేరీ కోమ్, పీవీ సింధు టోక్యోలో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నారు. శనివారం న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత పురుషుల హాకీ టీమ్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఒలింపిక్స్‌ మూడో రోజు భారత షెడ్యూల్

1. సెయిలింగ్- పురుషుల/ మహిళల లేసర్ హీట్స్

2. షూటింగ్- మహిళలు 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ క్వాలిఫికేషన్- ఉదయం 5.30 గంటలకు

4. షూటింగ్- ఫురుషుల స్కీట్ క్వాలిఫికేషన్- ఉదయం 6 గంటలకు

5. జిమ్నాస్టిక్స్- మహిళల ఆల్‌రౌండ్ క్వాలిఫికేషన్ - ఉదయం 6.30 గంటలకు

6. రోయింగ్- పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ రెప్‌చేజ్- ఉదయం 6.30 గంటలకు

7. టేబుల్ టెన్నిస్- మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్- ఉదయం 6.30 గంటలకు

8. షూటింగ్- మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్ - ఉదయం 7.45 గంటలకు

9. షూటింగ్- పురుషుల 10 మీటర్ల రైఫిల్ క్వాలిఫికేషన్-9.30 గంటలకు

10. టేబుల్ టెన్నిస్- పురుషుల సింగిల్స్ రౌండ్2- ఉదయం 10.30

11. టేబుల్ టెన్నిస్- మహిళల సింగిల్స్ రౌండ్ 2- ఉదయం 10.30 గంటలకు

12. బ్యాడ్మింటన్- మహిళల సింగిల్స్- పీవీ సింధు vs సెనియా పొలికర్పోవా(ఇజ్రాయిల్)

13. షూటింగ్- పురుషుల 10 మాటర్ల ఎయిర్ రైఫిల్- మధ్యాహ్నం 12 గంటలకు

14. బాక్సింగ్- మహిళల ఫ్లై వెయిట్ రౌండ్ 32- మేరీ కోమ్ vs మిగులినా(డొమెనికన్ రిపబ్లిక్)

15. హాకీ- భారత పురుషులు vs ఆస్ట్రేలియా- మధ్యాహ్నం 3 గంటలకు

16. బాక్సింగ్- పురుషుల లైట్ వెయిట్ రౌండ్ 32- మనీశ్ కౌశిక్ vs లుక్ మెక్‌కొర్మాక్

17. స్విమ్మింగ్- మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్- మధ్యాహ్నం 3.32 గంటలకు

18. స్విమ్మింగ్- పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్ సాయంత్రం 3.52 గంటలకు

19. టెబుల్ టెన్నిస్- మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్స్- సాయంత్ర 4.30 గంటలకు

20. స్విమ్మింగ్- పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్- సాయంత్రం 4.49 గంటలకు

21.ఈక్వెస్ట్రెయిన్- వ్యక్తిగత డ్రెస్సేజ్ గ్రాండ్ ప్రిక్స్-డే2

Story first published: Saturday, July 24, 2021, 18:49 [IST]
Other articles published on Jul 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X