న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo 2020: మహిళా అథ్లెట్లపై ఆ దృష్టి ఉండకూడదని.. కెమెరాలపై కఠిన ఆంక్షలు!

Tokyo 2020: The Olympics’ new broadcast mantra ‘Sport appeal, not sex appeal’

టోక్యో: లింగ సమానత్వానికి ప్రాధాన్యమిచ్చిన టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా అథ్లెట్లకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయరాదని ఒలింపిక్స్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవెంట్స్ సందర్భంగా మహిళా అథ్లెట్ల శరీరాన్ని అతిగా ప్రదర్శించేలా, వ్యక్తిగత అవయవ భాగాలు కనిపించేలా, అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయకూడదని నిర్ణయించింది.

'స్పోర్ట్‌ అప్పీల్, నాట్‌ సెక్స్‌ అప్పీల్‌" అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఒలింపిక్స్‌ నిర్వాహకులు మైదానంతో పాటు తెరపైనా లింగ సమానత్వం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 'గతంలో చూపించినట్లుగా ఈ క్రీడల్లో మహిళా అథ్లెట్లకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు తెరపై కనిపించవు. అథ్లెట్ల శరీర భాగాలను దగ్గరగా చూపించడం ఉండదు" అని ఒలింపిక్‌ అధికారిక బ్రాడ్ కాస్టర్ సర్వీసెస్ సీఈఓ యానిస్‌ ఎక్సార్చోస్‌ తెలిపాడు. దాంతో బీచ్‌ వాలీబాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ట్రాక్‌ విభాగాల్లో అమ్మాయిల పోటీలను ప్రసారం చేయడం కెమెరామెన్లకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

ఇలాంటి క్రీడాంశాల్లో మహిళా అథ్లెట్లు సౌకర్యం కోసం బికినీల్లాంటి పొట్టి పొట్టి దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఆ అథ్లెట్లను కొంతమంది కామ వాంఛతో చూసే ప్రమాదం ఉంది. ఇప్పటికే మహిళా జిమ్నాస్ట్‌లపై లైంగిక వేధింపులతో పాటు వాళ్లను వేరే దృష్టిలో చూడడం ఎక్కువైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే టోక్యోలో జర్మనీ జిమ్నాస్ట్‌లు కాలి మడమ వరకూ నిండుగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించి పోటీల్లో పాల్గొన్నారు. పోటీపడే అమ్మాయిలు వేసుకునే దుస్తులపై ఇప్పటివరకూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఎలాంటి నిబంధనలు విధించలేదు కానీ ఈ సారి ప్రసార దృశ్యాలపై ఆంక్షలు విధించనుంది.

చాలా కాలంగా మహిళా అథ్లెట్లను పూర్తిస్థాయి క్రీడాకారులుగా గుర్తించడం లేదని, అందంగా ఆక్షరణీయంగా ఉన్న ప్లేయర్లపై కెమెరాలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయని మాజీ మహిళా అథ్లెట్లు ఆరోపిస్తున్నారు. కనీసం ఈ ఒలింపిక్స్ నుంచి అయినా ఆ విషయంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు.

Story first published: Tuesday, July 27, 2021, 19:22 [IST]
Other articles published on Jul 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X