న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paralympics 2020: టేబుల్‌ టెన్నిస్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరిక భావినాబెన్‌.. నాకౌట్ అవకాశాలను చేజార్జుకున్న ...

Bhavinaben Patel beat Megan Shackleton advances to round of 16, Sonalben Patel crashes out

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌ 2020లో భారత ప్యాడ్లర్‌ భావినాబెన్‌ పటేల్‌ సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో ప్రి క్వార్టర్స్‌ చేరుకుంది. గ్రేట్‌ బ్రిటన్‌ అమ్మాయి మేగన్‌ షక్లెటన్‌తో జరిగిన టేబుల్‌ టెన్నిస్‌ మ్యాచులో 3-1 తేడాతో భావినాబెన్‌ ఘన విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన హోరాహోరిగా జరిగిన ఈ పోరులో భావినాబెన్‌ 11-7, 9-11, 17-15, 13-11 తేడాతో షక్లెటన్‌ను ఓడించింది.

IND vs ENG: టీ బ్రేక్‌.. ఇంగ్లండ్ 298/3! భారీ ఆధిక్యంలో రూట్ సేన!!

భావినాబెన్‌ పటేల్‌ బుధవారం జరిగిన తొలి రౌండు పోరులో పరాజయం చవిచూసింది. భావినాబెన్‌పై పోరుకు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచు ఇది. దూకుడుగా ఆడి ఎనిమిది నిమిషాల్లోనే తొలి రౌండ్‌ గెలిచింది. అయితే ప్రత్యర్థి తనదైన శైలిలో పుంజుకోవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత నువ్వా నేనా అన్నటుగా సాగింది మ్యాచ్. చివరికి భావినా విజయం సాధించింది. మొత్తంగా రెండు మ్యాచుల్లో 3 పాయింట్లతో భావినాబెన్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.

మ్యాచ్ అనంతరం భావినాబెన్‌ పటేల్‌ మాట్లాడుతూ.... 'మున్ముందు జరిగే మ్యాచుల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఈ రోజు నేను చాలా ఓపికగా ఆడాను. బంతిపైనే ఏకాగ్రత నిలిపాను. ప్రతికూల ఆలోచనలతో మ్యాచు వదులుకూడదని నిర్ణయించుకున్నా. కఠిన మ్యాచులో గెలిచినందుకు సంతోషంగా ఉంది. చెరో పాయింటు సాధిస్తూ వెళ్లినా పట్టు వదల్లేదు. మెడల్ సాధించడం కోసమే ఇక్కడికి వచ్చాను. అందుకోసం నా ప్రయత్నం చేస్తాను' అని చెప్పింది.

మరోవైపు టెన్నిస్ క్రీడాకారిణి సోనాల్‌బెన్ పటేల్ మహిళల సింగిల్స్‌లో క్లాస్ 3 నాకౌట్ రౌండ్‌కు చేరే అవకాశాన్ని చేజార్జుకుంది. ఈరోజు కొరియాకు చెందిన లీ మి-గుయుతో జరిగిన ఫైనల్ గ్రూప్ డి మ్యాచ్‌లో సోనాల్‌బెన్ ఓటమి పాలైంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సోనాల్‌బెన్ పరాజయం పాలవడంతో మహిళల సింగిల్స్ క్లాస్ 3.. 3-పెడ్లర్ గ్రూప్ డిలో చివరి స్థానానికి పరిమితమైంది. సోనాల్‌బెన్‌కు ఇది తొలి పారాలింపిక్స్. బుధవారం జరిగిన మహిళల క్లాస్‌ 3 కేటగిరి సింగిల్స్‌ తొలిరౌండ్‌ మ్యాచ్‌లో ఆమె మొదటి మూడు రౌండ్లలోనూ సత్తా చాటినా.. ఆ తర్వాత విఫలమైంది. ఫలితంగా 11-9, 3-11, 17-15, 7-11, 4-11తో రియో పారాలింపిక్స్‌ రజత పతక విజేత లి క్వాన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది.

Story first published: Thursday, August 26, 2021, 22:07 [IST]
Other articles published on Aug 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X