న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదేళ్ల పాటు ఒక్కపూటే తిన్నా.. అర్జున అవార్డీ సారికా కాలే

Arjuna Award winner Kho kho captain Sarika Kale consumed one meal a day for a decade

ముంబై: పేదరికం కారణంగా కనీసం ఓ పదేళ్ల పాటు ఒక్కపూటే భోజనం చేశానని భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్ సారికా కాలే తెలిపింది. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించిన స్పోర్ట్స్ అవార్డుల్లో ఆమెకు అర్జున పురస్కారం వరించింది. దీంతో 22 ఏళ్ల తర్వాత ఖోఖో నుంచి ఈ అవార్డు అందుకున్న ప్లేయర్‌గా సారికా గుర్తింపు పొందింది. ఖోఖోనే తన జీవితాన్ని మార్చిందని ప్రస్తుతం మహారాష్ట్రలో క్రీడా అధికారిణిగా పనిచేస్తున్న ఆమె తెలిపింది. తనకు అర్జున అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసింది.

 జాబితాలో నా పేరు చూడగానే..

జాబితాలో నా పేరు చూడగానే..

‘పురస్కారాల జాబితాలో నా పేరు చూడగానే నేను ఖోఖో ఆడిన రోజులు గుర్తొచ్చాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా కనీసం ఓ పదేళ్లపాటు కేవలం ఒంటి పూటే భోజనం చేశాను. తల్లి కుట్టు మిషన్‌ కుట్టేది. తండ్రికి ఆదాయం తక్కువ. తాత సంపాదనపైనే మేమంతా ఆధారపడేవాళ్లం. నేను క్యాంపులో ఉన్నప్పుడో లేక టోర్నీల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే పోషకాహారం లభించేది. లేకుంటే ఒంటిపూటే భోజనం. ఆర్థిక ఇబ్బందులతో ఆట నుంచి తప్పుకోవాలనుకున్నా ముందుకే సాగాను.

ఖోఖోతోనే నా జీవితం మారింది..

ఖోఖోతోనే నా జీవితం మారింది..

కుటుంబ పరిస్థితులు నాలో మరింత కసిని పెంచాయి. ఖోఖో కారణంగానే నాకు గతేడాది తుల్జాపూర్‌లో క్రీడా అధికారిణిగా ఉద్యోగం లభించింది. దీంతో నా జీవితం మారింది' అని 27 ఏళ్ల సారిక పేర్కొంది. రూరల్ వాతావరణానికి సంబంధించిన ఆటల్లో ప్రతిభను గుర్తించడానికి కొంత ఆలస్యం అవుతుందని తెలిపింది. సారికాకు అవార్డు రావడం పట్ల ఆమె కోచ్ చంద్రజిత్ జయదేవ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.

అనేక మెడల్స్..

పేదరికం కారణంగా ఒకానొక దశలో ఆటకు స్వస్తీ చెప్పాలనుకుందని, కానీ సరైన కౌన్సిలింగ్ ఇచ్చి కొనసాగేలా చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమె కారణంగానే ఆసియా ఖోఖో చాంపియన్ షిప్‌లో భారత్ మెడల్ సాధించిందన్నాడు. ఇక ఎన్ని కష్టాలు ఎదురైనా సారికా ఆటను వదల్లేదు. అటు తల్లిదండ్రుల సహకారం కూడా తోడవడంతో జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి పతకం అందించగలిగింది. 2016 దక్షిణాసియా గేమ్స్‌లో భారత జట్టుకు స్వర్ణం అందించడంతో పాటు సారిక.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగానూ నిలిచింది. సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె అనేక మెడల్స్ గెలిచింది.

 ఖోఖోకు మంచి రోజులు..

ఖోఖోకు మంచి రోజులు..

సారికాకు అర్జున అవార్డు రావడంపై ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాన్షు మిట్టల్ సైతం సంతోషం వ్యక్తం చేశాడు. ఖోఖో ప్లేయర్ ప్రతిభ గుర్తించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఖోఖోకు బంగారు రోజులు. 22 ఏళ్ల తర్వాత ఖోఖో ప్లేయర్‌కు అర్జున అవార్డు దక్కింది. మహిళల కెప్టెన్ సారిక కాలేకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. స్వదేశీ క్రీడల అభివద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుంది'అని పేర్కొన్నారు.

లక్ష్మణ్ అనే నేను హామీ ఇస్తున్నా.. ఖాళీ స్టేడియాల్లో జరిగినా క్వాలిటీలో తేడా ఉండదు!

Story first published: Tuesday, August 25, 2020, 12:09 [IST]
Other articles published on Aug 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X