లక్ష్మణ్ అనే నేను హామీ ఇస్తున్నా.. ఖాళీ స్టేడియాల్లో జరిగినా క్వాలిటీలో తేడా ఉండదు!

దుబాయ్: కరోనా కారణంగా యూఏఈకి తరలిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ బయో సెక్యూర్ వాతావారణంలో జరుగనుంది. మరో నాలుగు వారాల్లో లీగ్ షురూ కానుంది. అయితే ఈ మెగా లీగ్ తొలిసారి ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా.. ఖాళీ స్టేడియాల్లో జరగనుంది. దాని వల్ల లీగ్ కళ తప్పుతుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునపటి మజా ఉండదని అంటున్నారు. కానీ, ఆందోళన అవసరం లేదని లెజండరీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అంటున్నాడు.

డోకాలేదు.. నాది హామీ..
ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ జరిగినంత మాత్రాన క్రికెట్ నాణ్యత ఏమాత్రం తగ్గిపోదని ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మెంటార్ హామీ ఇస్తున్నాడు.
‘నేను అభిమానులందరికీ హామీ ఇస్తున్నా. మైదానంలో ప్రేక్షకులు లేనప్పటికీ క్రికెట్ నాణ్యతలో ఎలాంటి మార్పూ ఉండబోదు. ముందులాగే ఈ ఐపీఎల్ కూడా మీ అందర్నీ అలరిస్తుందనే నమ్మకముంది'అని లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ షేర్ చేసిన ఓ వీడియోలో లక్ష్మణ్ పేర్కొన్నాడు.

పిచ్‌ల స్వభావమే..
అయితే యూఏఈ పిచ్‌ల స్వభావంపై మాత్రం కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఇక్కడి వికెట్లు కొంచెం నెమ్మదిగా ఉంటాయి. అయితే, అవి స్పందిస్తాయో తెలుసుకునేందుకు ఓపిక అవసరం. ఎందుకంటే మైదాన సిబ్బంది చేసే పనుల వల్ల ఈ వికెట్లు కొన్ని అనూహ్యంగా తయారువుతాయి. ఔట్ ఫీల్డ్ అద్భుతంగా ఉంటుంది. కానీ వికెట్ల విషయంలో మైదాన సిబ్బంది మరింత కేర్ తీసుకోవాలి'అని సూచించాడు.

ట్రేవర్ సక్సెస్‌ఫుల్ కోచ్..
ఈ సీజన్ వేలానికి ముందే సన్‌రైజర్స్ తమ కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌లో మార్పులు చేసింది. టామ్ మూడీ ప్లేస్‌లో ట్రేవర్ బేలిస్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది. అలాగే అసిస్టెంట్ కోచ్‌గా సిమోన్ హెల్మోట్‌ను తప్పించి గతంలో ట్రేవర్‌తో కలిసి పనిచేసిన బ్రాడ్ హడిస్‌ను తీసుకుంది. అయితే ట్రేవర్, బ్రాడ్ సామర్థ్యంపై లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘వరల్డ్ క్రికెట్‌లో మోస్ట్ సక్సెఫుల్ కోచ్‌ల్లో ట్రేవర్ ఒకరు. ఆయన పర్యవేక్షణలోనే ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ట్రేవర్‌ను నేను ఎప్పుడూ ఆరాధిస్తా. ఆయనతో ఇప్పటిదాకా జరిపిన ఇంటరాక్షన్స్ అద్భుతం. బెస్ట్ ప్లేయర్లను ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. బ్రాడ్ హడిస్ కూడా మంచి కోచ్. 100 శాతం పనిచేస్తాడు'అని లక్ష్మణ్ కొనియాడాడు.

అందుకే యువ ఆటగాళ్లను..
ప్రణాళిక ప్రకారమే యువ ఆటగాళ్లను తీసుకున్నామని లక్ష్మణ్ తెలిపాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, హైదరాబాదీ భవనక సందీప్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. మిడిలార్డర్ కోసం కుర్రాళ్లను తీసుకోవాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నామని లక్ష్మణ్ చెప్పాడు. ‘వేలంలో కావాలనే కుర్రాళ్లను ఎంచుకున్నాం. వాళ్లంతా యువకులే అయినా డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొట్టారు. భారత్‌తో పాటు విదేశీ ఆటగాళ్లు అనుభవజ్ఞులు. మిడిలార్డర్‌లో బలోపేతం చేసేవాళ్లు అవసరమయ్యారు. అందుకే యువ ఆటగాళ్లను తీసుకున్నాం'అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఒక్క తప్పు టోర్నీ మొత్తాన్ని దెబ్బతీస్తుంది.. టీమ్‌మేట్స్‌కు కోహ్లీ వార్నింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications