న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2019: గులియా సూపర్-10, ఆరు ఓటముల తర్వాత విజయం

Pro Kabaddi League 2019: Rohit Gulia Super 10 helps Gujarat Fortunegiants end their losing streak, beat Patna Pirates

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌కు ఎట్టకేలకు ఊరట చెందింది. గత ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ తిరిగి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 29-26తో పాట్న పైరేట్స్‌పై గెలుపొందింది.

1st Test Day 2 in Antigua: జడేజా హాఫ్ సెంచరీ, టీమిండియా 297 ఆలౌట్

జెయింట్స్ తరఫున రోహిత్ గులియా (10 పాయింట్లు) సూపర్-10 సాధించి ఫార్చూన్ జెయింట్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పాట్నా తరఫున డుబ్కీ కింగ్‌ప్రదీప్ నర్వాల్ 9 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్‌ మొదలైన ఐదు నిమిషాలకే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన పట్నా 10-3తో ఆధిక్యం సంపాదించింది.

ఒకానొక దశలో గుజరాత్‌ పుంజుకున్నట్లే కనిపించినప్పటికీ పట్నా తన ఆధిక్యాన్ని కొనసాగించింది. ప్రదీప్ రెచ్చిపోవడంతో హాఫ్ తొలి అర్ధభాగాన్ని 15-11తో ముగించింది. ఇక, రెండో భాగంలో రోహిత్‌ జోరుతో పట్నాను ఆలౌట్‌ చేసిన గుజరాత్‌ 17-16తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అక్కడి నుంచి పోరు హోరాహోరీగా సాగింది.

యాషెస్‌లో అరుదైన ఘనత: లీడ్స్‌లో రికార్డు నెలకొల్పిన డేవిడ్ వార్నర్

ఒకానొక దశలో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. అయితే, చివర్లో రోహిత్‌ గులియా మాయ చేయడంతో మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా గుజరాత్‌ 27-24తో ఆధిక్యం సాధించింది. చివరి వరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, పట్నాకు ఇది హ్యాట్రిక్‌ ఓటమి.మరో మ్యాచ్‌లో యు ముంబా 29-24తో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. శనివారం నుంచి ఢిల్లీ అంచె మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ప్రొ కబడ్డీలో శనివారం
దబంగ్‌ ఢిల్లీ vs బెంగళూరు బుల్స్‌ (రాత్రి 7:30 నుంచి)
జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ vs తెలుగు టైటాన్స్‌ (రాత్రి 8:30 నుంచి)

Story first published: Saturday, August 24, 2019, 7:47 [IST]
Other articles published on Aug 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X