
హైదరాబాద్: ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 297 పరుగులకు ఆలౌటైంది. 203/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 94 పరుగులు మాత్రమే చేసి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు క్రీజులోకి వచ్చిన కాసేపటికే రిషబ్ పంత్(24) ఔటయ్యాడు.
జట్టు స్కోరు 207 పరుగుల వద్ద రిషబ్ పంత్.. కీమర్ రోచ్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం పేసర్ ఇషాంత్‌శర్మ(19)తో కలిసిన జడేజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 60 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాక ఇషాంత్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ డకౌట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రాతో నిలకడగా ఆడిన రవీంద్ర జడేజా(58) హాఫ్ సెంచరీ సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా(4)తో కలిసి జడేజా మరో 29 పరుగులు జోడించి హోల్డర్ బౌలింగ్‌లో పదో వికెట్‌గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ నాలుగు వికెట్లు, గాబ్రియల్ మూడు, రోస్టన్ చేజ్ రెండు, హోల్డర్ ఒక వికెట్ తీశారు.