న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌లో అరుదైన ఘనత: లీడ్స్‌లో రికార్డు నెలకొల్పిన డేవిడ్ వార్నర్

Ashes 2019: This is the first time in David Warners Test career where he has taken three catches in an innings

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా యాషెస్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లను పట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

PKL 2019: రైడ్‌కు వెళ్లాడంటే పాయింట్ తేవాల్సిందే!

యాషెస్ సిరిస్‌లో ఇప్పటివరకు 11 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు. 2017లో గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో స్టీవ్ స్మిత్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. స్టీవ్ స్మిత్ తర్వాత మళ్లీ వార్నర్‌ ఈ ఘనత సాధించాడు.

మూడో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా డేవిడ్ వార్నర్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌లను క్యాచ్‌ల రూపంలో పెవిలియన్‌కు చేర్చాడు. గతంలో జరిగిన టెస్టుల్లో వార్నర్ ఒక ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లను ఐదు సార్లు మాత్రమే అందుకున్నాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ 22 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసి కష్టాల్లో పడింది. పేస్‌కు అనుకూలిస్తోన్న పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్(9), జేసన్ రాయ్(9) పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచారు.

ప్రక్షాళన: ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా హెసన్, హెడ్‌కోచ్‌గా కటిచ్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతర డో డెన్లీ(12), బెన్ స్టోక్స్(8), జానీ బెయిర్ స్టో(4) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్(4), క్రిస్ వోక్స్(4) పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజెల్‌ఉడ్ 3 వికెట్లు తీయగా, ప్యాటిన్సన్ 2, కమ్మిన్స్‌కు ఒక వికెట్ లభించింది.

Story first published: Friday, August 23, 2019, 17:47 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X