వాస్కో(గోవా): ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ అదరగొట్టింది. శుక్రవారం జరిగిన లీగ్‌లో 4-2తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. గోల్స్ వర్షం కురిసిన ఈ మ్యాచ్ చివరిదాకా హోరాహోరీగా సాగింది. హైదరాబాద్ తరఫున అరిడేన్ శాంటానా (3వ నిమిషం), జొయెల్ చియనెస్(36వ నిమిషం), లిసన్ క్వాసో (85వ నిమిషం, 90వ నిమిషం) గోల్స్ చేశారు.
నార్త్ ఈస్ట్‌కు ఫెడ్రికో గాల్లిగో(45వ నిమిషం, పెనాల్టీ), బెంజ్‌మెన్ లాంబోట్(45+2 నిమిషం) గోల్స్ అందించారు. సెకండాఫ్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడగా.. ఐదు నిమిషాల తేడాలో రెండు గోల్స్ కొట్టిన లిసన్ హైదరాబాద్‌కు అదిరిపోయే విక్టరీ అందించాడు. ఈ విజయంతో హైదరాబాద్ టేబుల్‌లో మూడో ప్లేస్‌కు చేరింది.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి