న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చహల్ ఈసారీ ఏకంగా ఫ్యామిలీతోనే..!!

Yuzvendra Chahal shares another TikTok video, shakes a leg with his entire family

బెంగళూరు: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సోషల్ మీడియా వేదికగా చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇప్పటికే తన ఫన్నీ కామెంట్స్‌తో సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తున్న ఈ లెగ్ స్పిన్నర్.. టిక్‌టాక్ వీడియోలతోనూ హల్‌చల్ చేస్తున్నాడు.

కరోనా దెబ్బతో టిక్‌టాక్ స్టార్‌గా..

కరోనా దెబ్బతో టిక్‌టాక్ స్టార్‌గా..

ఇక కరోనా కారణంగా క్రీడా టోర్నీలు రద్దవ్వడం.. ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడటంతో టీమిండియా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతూ.. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడెప్పుడో సహచర క్రికెటర్లతో టిక్ టాక్ చేసిన ఈ టీమిండియా లెగ్ స్పిన్నర్.. మళ్లీ మెదలుపెట్టాడు.

కరోనా కట్టడికి చతేశ్వర్ పుజారా విరాళం!!

ఫెంటాస్టిక్ ఫోర్..

ఇటీవలే తన తండ్రితో టిక్ టాక్ చేసిన చహల్.. ఈ సారి ఏకంగా ఫ్యామిలీని దించేశాడు. తన తల్లి, సోదరి, తండ్రితో కలిసి టిక్ టాక్ స్టెప్పెలేసాడు. పైగా ఈ వీడియోను ఫెంటాస్టిక్ ఫోర్.. స్టే హోమ్ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. 9 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో చహల్ ఫ్యామిలీ ఓ ఫన్నీ బ్యాక్‌రౌండ్ ట్యూన్‌కు స్టెప్పులేసింది.

ముందైతే కోహ్లీని ఔట్ చేయండి..

ముందైతే కోహ్లీని ఔట్ చేయండి..

సోషల్ మీడియోలో ఏదో కామెంట్ చేస్తూ చహల్ రోజూ వార్తల్లో నిలుస్తున్నాడు. నిన్న ముంబై ఇండియన్స్ చేసిన ఓ ట్వీట్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. ‘చహల్..నిన్ను ఔట్ చేయడానికి బుమ్రా బంతిని సిద్దం చేస్తున్నాడు'కామెంట్ చేయగా.. ‘నేను ఏ పదో, 11వ స్థానంలో బ్యాటింగ్ చేస్తా.. ముందైతే మా కింగ్ కోహ్లీ, ఫించ్ హిట్టర్ డివిలియర్స్‌ను ఔట్ చేయండి'అని బదులిచ్చాడు.

చెస్ వల్లే క్రికెట్..

చెస్ వల్లే క్రికెట్..

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్రికెట్‌లో రాణించడానికి చెస్‌ ఆడిన అనుభవమే కారణమని చహల్ తెలిపాడు. ‘చెస్‌ నాకు ఓపికగా ఉండటం నేర్పింది. క్రికెట్‌లో కొన్నిసార్లు గొప్పగా బౌలింగ్‌ చేసినా వికెట్లు సాధించలేం. టెస్టు మ్యాచ్‌లో రోజంతా బౌలింగ్‌ చేసినా బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయలేం. మళ్లీ మరుసటి రోజు నూతన ఉత్సాహంతో బరిలోకి దిగాలి. అలాంటి సందర్భాల్లో చెస్‌ ఆడిన అనుభవం నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రశాంతతో ఉండి బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయగలను. చెస్‌, క్రికెట్‌ రెండూ ఇష్టమే. అయితే ఏది ఎంచుకోవాలని మా నాన్నని అడిగాను. నీకు ఇష్టమైనది ఎంపిక చేసుకో అని ఆయన చెప్పారు. ఎక్కువ ఆసక్తి ఉన్న క్రికెట్‌ను కెరీర్‌గా సెలక్ట్‌ చేసుకున్నా' అని చాహల్‌ తెలిపాడు.

Story first published: Tuesday, April 7, 2020, 19:24 [IST]
Other articles published on Apr 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X