న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2007 టీ20 ప్రపంచకప్ అనగానే మా గురించే మాట్లాడుతారు..కానీ రోహిత్ పాత్ర కూడా కీలకం: యువీ

Yuvraj Singh Says Rohit Sharma’s unbeaten 30 in T20 World Cup 2007 Final was the most important knock of the tournament

న్యూఢిల్లీ: భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ పాత్ర మరవలేనిదని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో హిట్ మ్యాన్ చేసిన 30 పరుగులు విజయానికి బాటలు వేసాయన్నాడు. ఈ మెగా టోర్నీకి సంబంధించి అందరూ తనతో పాటు, ధోనీ, గంభీర్‌ల గురించి మాట్లాడుతారని, కానీ రోహిత్ చేసిన పరుగులను మాత్రం ఏ ఒక్కరు గుర్తించలేదన్నాడు.

తాజాగా 'స్పోర్ట్స్ కీదా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పిన యువీ.. జట్టు సమష్టిగా రాణించడంతోనే ఈ చిరస్మరణీయ విజయం దక్కిందన్నాడు. ఈ టోర్నీలోనే యువరాజ్ ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి వరల్డ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో 70 పరుగులతో రాణించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

యువ ఆటగాళ్ల కసితోనే..

యువ ఆటగాళ్ల కసితోనే..

‘మా టీమ్ మొత్తం ఫియర్‌లెస్ ఆటగాళ్లతో నిండిపోయింది. అసలు ఎలా ముందుకు వెళ్లాలో కూడా మాకు తెలియదు. కానీ మా సత్తా చాటాలని ప్రతీ ఒక్కరం గట్టిగా అనుకున్నాం. ఆ కమిట్‌మెంట్‌తో అ‌ద్భుత ప్రదర్శన కనబర్చాం. ఏమాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లతో బరిలోకి దిగాం. రోహిత్‌కు అదే తొలి టోర్నీ. అప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఆర్పీ సింగ్, శ్రీశాంత్ కూడా కొత్తవాళ్లే కానీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అవకాశం వస్తే సత్తా చాటాలనే ఈ యువ ఆటగాళ్ల కసితోనే ఫైనల్ చేరామనేది నా అభిప్రాయం.

రోహిత్ ఇన్నింగ్స్ చాలా కీలకం

రోహిత్ ఇన్నింగ్స్ చాలా కీలకం

ఇక ఫైనల్లో గౌతం గంభీర్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. జట్టు సమష్టిగా చేలరేగడంతోనే ఈ విజయం దక్కింది. కానీ ప్రతీ ఒక్కరు నా గురించి లేకపోతే గంభీర్ వల్లేనని మాట్లాడుతుంటారు. కానీ ఏ ఒక్కరు ఫైనల్లో 16 బంతుల్లో రోహిత్ చేసిన 30 రన్స్‌ను గుర్తు చేసుకోరు. వాటి వల్లే భారత్ 157 పరుగులతో పాక్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచిందనే విషయాన్ని గ్రహించాలి. ఆ టోర్నీలో అది అతి ముఖ్యమైన ప్రదర్శన. ఇర్ఫాన్ 3 వికెట్లు పడగొట్టడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కానీ నా వరకైతే రోహిత్ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం'అని యువీ చెప్పుకొచ్చాడు.

ఇక ఆ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కు యువీ టెన్నిస్ ఎల్బో గాయంతో దూరమవగా.. అతని స్థానంలో రోహిత్ బరిలోకి దిగాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ చేసి భారత విజయంలోకీలక పాత్ర పోషించాడు.

ఉత్కంఠ పోరులో..

ఉత్కంఠ పోరులో..

ఇక ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్..నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేసింది. గౌతమ్ గంభీర్(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75), రోహిత్ శర్మ(16 బంతుల్లో2 ఫోర్లు 1 సిక్స్ 30 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఆద్యాంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజానందించింది. టీ20 ఫార్మాట్‌నే వ్యతిరేకించిన భారత్.. అరంగేట్ర పొట్టి ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచింది.

ధోనీ అలా అనుకుంటే నిరభ్యంతరంగా ఇంకొన్నేళ్లు ఆడొచ్చు: గౌతం గంభీర్

Story first published: Sunday, July 26, 2020, 19:57 [IST]
Other articles published on Jul 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X