న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 37 ఏళ్లు.. అపూర్వ ఘట్టాన్ని గుర్తుచేసుకుంటున్న క్రికెటర్లు!

Yuvraj Singh, Ravi Shastri and other cricketers celebrates Indias World Cup 1983 win on 37th anniversary

హైదరాబాద్: భారత క్రికెట్‌ చరిత్రలోనే అదో అద్భుత విజయం.! బహుషా యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని నేడు భారత్‌ శాసిస్తోందంటే అది ఆ గెలపు చలవే.! మనదేశంలో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి బీజం పడింది అక్కడే.! రోజుకు 1500 రూపాయల మ్యాచ్‌ ఫీజుల నుంచి కోట్లాది రూపాయల కనకవర్షం కురిపించే స్థాయికి క్రికెట్‌ చేరిందనడానికి ఆ విజయమే కారణం.! ఆ అపూర్వ ఘట్టం మరేదో కాదు.. కపిల్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983 వన్డే వరల్డ్‌కప్‌ గెలవడమే.! భారత క్రికెట్‌ గతిని మార్చేసిన ఈ ఘనతకు సరిగ్గా నేటితో 37 ఏళ్లు.!

ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు సోషల్‌మీడియా వేదికగా ఆ అద్భుత క్షణాన్ని నెమరువేసుకుంటున్నారు. నాటి సారథి కపిల్‌దేవ్‌తో పాటు ఆ విన్నింగ్ టీమ్ ఆటగాడు ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి, వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, మాజీ క్రికెటర్లు మహ్మద్‌ కైఫ్‌, యువరాజ్ సింగ్‌లు ఆ మధుర ఘట్టాన్ని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు.

మరవలేని రోజుకు 37 ఏళ్లు..

నాటి సారథి కపిల్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ అద్భుత విజయాన్ని స్మరించుకున్నాడు. లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ అందుకున్న త్రోబ్యాక్ ఫొటోను షేర్ చేస్తూ ‘ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 37 ఏళ్లు.'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక 1983 ప్రపంచకప్ విజయంతో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేశారనీ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘దేశం మొత్తం గర్వించిన క్షణం. సరిగ్గా ఇదే రోజు మా సీనియర్లు ప్రపంచకప్ అందుకున్నారు. ఆ జట్టులోని ప్రతీ ఆటగాడికి అభినందనలు. ఈ విజయంతో 2011 ప్రపంచకప్‌ను మేం గెలిచేలా బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇక అన్ని క్రీడల్లో భారత్ విశ్వవిజేత కావాలనుకుంటుంది.'అని యూవీ పేర్కొన్నాడు.

అనుకున్నాం.. గెలిచాం..

1983 ప్రపంచకప్ టోర్నీలో చాంపియన్లుగా అవతరిస్తామని అనుకున్నామని, అలాగే గెలిచామని ఆ విన్నింగ్ టీమ్ మెంబర్, భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ‘1983 జూన్‌ 25న ప్రపంచ చాంపియన్లుగా అవతరిస్తామని అనుకున్నాం. అలాగే గెలిచాం. అలా భారతలో క్రికెట్‌ స్వరూపాన్నే మార్చేశాం. ఈ సందర్భంగా అప్పటి కపిల్‌ డెవిల్స్‌కు, భారతీయులకు ధన్యవాదాలు.'అని తన త్రోబ్యాక్ పిక్ జత చేస్తూ రవిశాస్త్రి క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

కపిల్ చెప్పిన ఆ మాటలే 1983 ప్రపంచకప్ విజయానికి కారణం: శ్రీకాంత్

క్రికెట్ మార్పునకు అదే కారణం..

ఇక భారత క్రికెట్‌ మార్పునకు 1983 ప్రపంచకప్ విజయమే కారణమని మహ్మద్ కైఫ్ తెలిపాడు. ‘ఆ నాడు లార్డ్స్‌ మైదానంలో ప్రపంచకప్‌ను అందుకున్న కపిల్‌ ఫొటో భారత క్రికెట్‌ చరిత్రలో మరిచిపోలేని దృశ్యం. మన దేశంలో క్రికెట్‌ మార్పునకు అదే కారణం. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చని ఈ విజయం భావితరాలకు తెలియజేసింది. స్ఫూర్తిమంత్రంగా నిలిచింది. అలాగే పెద్ద కలలు కనాలని సూచించింది.'అని మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్ చేయగా.. ‘37 ఏళ్ల క్రితం ప్రపంచకప్‌ సాధించిన కపిల్‌దేవ్‌ జట్టుకు ధన్యవాదాలు. అలాగే మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు'అని హర్భజన్‌సింగ్‌ స్మరించుకున్నాడు.

భారత్ 180.. విండీస్ 140

భారత్ 180.. విండీస్ 140

నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 183 పరుగులకు ఆలౌటవ్వగా తర్వాత విండీస్‌ 140 పరుగులకే కుప్పకూలింది. మోహిందర్‌ అమర్‌నాథ్‌ ఆల్‌రౌండ్ షోతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కపిల్ సేన విశ్వవిజేతలుగా నిలిచి భారత క్రికెట్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇక ఆ మ్యాచ్‌లో తమ స్కోర్ చూసి గెలుస్తామనుకోలేదని, కానీ కపిల్ మాటలు స్పూర్తిని రగిల్చాయని నాటి విన్నింగ్ టీమ్ ఓపెనర్ క్రిష్ శ్రీకాంత్ తెలిపాడు.

Story first published: Thursday, June 25, 2020, 17:44 [IST]
Other articles published on Jun 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X