న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో ఓ శకం ముగిసింది.. సరిలేరు ధోనీకెవ్వరూ... ప్రముఖుల స్పందన

YS Jagan, Sourav Ganguly and other Cricketers Reacts To MS Dhonis Retirement

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో అనూహ్యంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. 'కెరీర్‌ ఆద్యంతం నన్ను ప్రేమించడంతో పాటు మద్దతుగా నిలిచిన మీ అందరికీ కృతజ్ఞతలు. రాత్రి 7.29 నుంచి ఇక నేను రిటైర్‌ అయినట్టుగా భావించండి' అని 39 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్‌ క్లుప్తంగా పేర్కొన్నాడు. ఐపీఎల్ క్యాంప్ కోసం చెన్నైకి వచ్చిన ఓ రోజు తర్వాత ఈ నిర్ణయం రావడం గమనార్హం. అయితే ఈ అనూహ్య నిర్ణయంపై అభిమానులంతా షాకయ్యారు. ఇక భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదిగిన ధోనీకి ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ఘన వీడ్కోలు పలికారు. సినీ, క్రీడా, రాజకీయా, వ్యాపార రంగాలవారు ధోనీ సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

ఓం ఫినిషాయనమ:..

ఓం ఫినిషాయనమ:..

ఓశకం ముగిసింది. ధోనీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఓ గొప్ప క్రికెటర్ అతని లీడర్‌షిప్ సామర్థ్యాన్ని మ్యాచ్ చెయ్యలేం. మరీ ముఖ్యంగా టీ20ల్లో చాలా కష్టం. కెరీర్ ప్రారంభంలో వన్డేల్లో అతను బ్యాటింగ్ చేసిన విధానంతో తన ప్రతిభ, నేచురల్ టాలెంట్ ప్రపంచం గుర్తించింది. ప్రతి మంచి విషయానికి ఓ ముగింపు ఉంటుంది. ఇది నిజంగా చాలా గొప్ప ముగింపు దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకునే వికెట్ కీపర్లకు స్టాండర్డ్స్ కూడా సెట్ చేశాడు. ఎలాంటి లోటు, బాధ లేకుండా క్రికెట్ ఫీల్డ్‌ను వీడుతున్నాడు. లైఫ్‌లో అతనికి అంతా మంచే జరగాలి. -సౌరవ్ గంగూలీ

అలాంటి ప్లేయర్ ఉండం.. మిషన్ ఇంపాజిబుల్.. ధోనీలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు, ఉండరు, ఉండబోరు. ఎంతో మంది ప్లేయర్లు మస్తూపోతూ ఉంటారు. కానీ ధోనీలాంటి కామ్ పర్సన్ ఇంకొకరు ఉండరు. ప్రజలకు ధోనీతో ఎంత అనుబంధం ఉందంటే క్రికెట్ లవర్స్ అతన్ని కుటుంబ సభ్యునిగా భావిస్తారు. ఓం ఫినిషాయనమ:-సెహ్వాగ్

అంతులేని డీఆర్‌ఎస్‌లతో..

అంతులేని డీఆర్‌ఎస్‌లతో..

ధోనీ నువ్వు భారత క్రికెట్‌కు అందించిన సేవలు వెలకట్టలేనివి. మనం కలిసి 2011 ప్రపంచకప్ సాధించడం నా జీవితంలోనే గొప్ప క్షణం. సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా నీకు, నీ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఆల్‌ద‌బెస్ట్- సచిన్ టెండూల్కర్

భారత్ ఏ నుంచి మొదలుపెట్టి.. ‘ద ఇండియా' వరకు మన ప్రయాణంలో ఎన్నో ప్రశ్నలు, కామాలు, ఖాళీలు, ఆశ్చర్యార్థకాలు, నువ్వు ఇప్పుడు ఓ చాప్టర్‌కు ఫుల్ స్టాప్ పెట్టావు. అనుభవంతో చెబుతున్నా ఈ కొత్త జీవితం అంతులేని డీఆర్‌ఎస్‌లతో చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా ఆడావు.-గౌతమ్ గంభీర్

‘చిన్న పట్టణంనుంచి వచ్చి మ్యాచ్‌ విన్నర్‌గా, గొప్ప నాయకుడిగా ఎదిగిన ధోని ప్రయాణం అద్భుతం. నువ్వు అందించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను' -వీవీఎస్‌ లక్ష్మణ్‌

నిజమైన సైనికుడివి..

నిజమైన సైనికుడివి..

దేశానికి అన్ని ఐసీసీ ట్రోఫీలు అందించిన నిజమైన సైనికుడు. భారత క్రికెట్‌కు నీవు అందించిన సేవలకు ధన్యవాదాలు-బీసీసీఐ

వన్డేల్లో భారత కెప్టెన్లలో చూసుకుంటే ధోనీ, కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్లు ప్రపంచకప్‌లు గెలిచారు. మొత్తంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తీసుకుంటే కపిల్ కంటే ధోని ముందుంటాడు. -గావస్కర్

‘ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ధోని కెరీర్‌ ముగిస్తున్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌ సహచరుడిగా నీలాంటి ప్రొఫెషనల్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన ధోనికి సెల్యూట్‌' -రవిశాస్త్రి

మీ వారసత్వం.. స్పూర్తిదాయకం: వైఎస్ జగన్

మీ వారసత్వం.. స్పూర్తిదాయకం: వైఎస్ జగన్

‘అద్భుత కెరీర్‌ ముగించిన ఎమ్మెస్‌ ధోనికి అభినందనలు. మీరు వదిలి వెళుతున్న క్రికెట్‌ వారసత్వం క్రికెట్‌ ప్రేమికులు, ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా' - వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి

ఎన్నో ఉత్కంఠభరిత పోరాటాలను జట్టుకు అనుకూలంగా మలిచాడు. భిన్న ఫార్మాట్లలో జట్టును చాంపియన్‌గా నిలిపాడు. హెలికాప్టర్ షాట్లను ప్రపంచ క్రికెట్ కోల్పోనుంది - హోం మంత్రి అమిత్ షా

‘గొప్ప కెరీర్‌ను ముగించినందుకు ధోనికి నా అభినందనలు. నీతో కలిసి ఆడటం నాకూ గర్వకారణం. నాయకుడిగా నీ ప్రశాంత శైలితో అందించిన విజయాలు ఎప్పటికీ మధురానుభూతులే' - అనిల్‌ కుంబ్లే

బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!

Story first published: Sunday, August 16, 2020, 8:41 [IST]
Other articles published on Aug 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X