న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: కోహ్లీసేన టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలి.. ఎందుకంటే..?

WTC Final: If Virat Kohli Wins The Toss India should Bat First, here are the possible reasons

సౌతాంప్టన్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్​ టెస్టు చాంపియన్​షిప్ ఫైనల్​కు వరణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న సౌతాంప్టన్‌లో గత 24 గంటలుగా వర్షం కురుస్తుండటంతో ఆట ప్రారంభమవ్వకుండానే ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ రద్దయింది. దీంతో టాస్ కూడా ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా ప్రకటించింది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కావాల్సిన ఈ మ్యాచ్​.. ఈ రోజు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. అయితే ఈ మ్యాచ్​ జరగనున్న ఐదు రోజుల పాటు వర్షం పడే అవకాశాలున్నాయని అక్కడి వాతావారణ శాఖ తెలిపింది.

అయితే ఈ మెగా ఫైనల్లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని టీమిండియాకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ సూచించాడు. పిచ్, వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే.. న్యూజిలాండ్‌తో జరిగే ఈ మెగా పోరులో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్‌ ఎంచుకుంటే మంచిదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సూచించాడు. అంతేకాక మెగా ఫైనల్లో కోహ్లీసేన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఫస్ట్ బ్యాటింగ్ బెటర్..

ఫస్ట్ బ్యాటింగ్ బెటర్..

'రికార్డు పరిశీలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే భారత్ ఫారిన్‌లో ఎక్కువ విజయాలు సాధించింది. 2002 లీడ్స్‌లో కావొచ్చు. 2018లో సౌతాఫ్రికాలో కావాచ్చు. బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉన్నప్పటికీ భారత్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది. ఆరంభంలో ఉన్న ఒత్తిడి తట్టుకుని నిలబడి భారీ స్కోరు చేసి విజయం కూడా సాధించింది. సీమింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు మార్క్ టేలర్, స్టీవ్ వా కూడా చాలా అరుదుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇక, ఫైనల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌పై పెద్ద బాధ్యత ఉంది.'అని దాదా చెప్పుకొచ్చాడు.

ఒత్తిడిలో బ్యాటింగ్ కష్టం..

ఒత్తిడిలో బ్యాటింగ్ కష్టం..

క్రికెట్ విశ్లేషకులు సైతం ఇదే మాట చెబుతున్నారు. వర్షం అంతరాయం కలిగించనున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే అడ్వాంటేజ్‌ ఉంటుందంటున్నారు. పైగా ఈ మెగా పోరు‌లో ఆటగాళ్లపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని, దాంతో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుందంటున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా సాఫీగా ఆడాలంటే టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. పైగా చివరి రెండు రోజులు పిచ్‌పై పగుళ్లు వచ్చి స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంటుందని, నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

తటస్థ వేదిక కాబట్టి..

తటస్థ వేదిక కాబట్టి..

అయితే పిచ్‌ మరి పచ్చికగా ఉంటేనే తొలుత ఫీల్డింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందని, కానీ ఐసీసీ ఈవెంట్ కావడంతో పిచ్ న్యూట్రల్‌గా ఐదురోజులు ఆట సాగేలా ఉంటుందంటున్నారు. కాబట్టి టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్ చేస్తే మ్యాచ్‌ను శాసించవచ్చంటున్నారు. ఇరు జట్లలో ఓపెనర్లు కీలకం కానున్నారని, అలాగే బౌలర్లు రాణించడంపై కూడా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు.

Story first published: Friday, June 18, 2021, 16:50 [IST]
Other articles published on Jun 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X