న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజస్థాన్ రాయల్స్ వినూత్న ఆలోచన.. క్రికెటర్ల భార్యలతో..

Wives of the Rajasthan Royals’ team reveal what their partners do at home

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌లు కూడా నిలిచిపోయాయి. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉండటంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కాలక్షేపం చేస్తున్నారు. ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ లైవ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఐపీఎల్ వాయిదాపడటంతో ఫ్రాంచైజీలన్నీ సోషల్ మీడియా వేదికగా తమ ఆటగాళ్లతో లైవ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి.

వినూత్నంగా ఆలోచించిన రాజస్థాన్..

అయితే అందరిలా చేస్తే తమకేం గుర్తింపు ఉంటుందనుకుందో ఏమో కానీ.. రాజస్థాన్ రాయల్స్ వినూత్నంగా ఆలోచించింది. అన్నీ ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో లైవ్ సెషన్స్ నిర్వహిస్తుంటే.. రాజస్థాన్ ఏకంగా తమ క్రికెటర్ల సతీమణులతో ఓ వీడియోను రూపొందించి ట్వీట్ చేసింది. దీనికి ‘ఇళ్లల్లో రాయల్స్ బాయ్స్ ఎలా ఉన్నారో వారి మహిళలు చెబుతున్నారు వినండి'అని క్యాప్షన్‌గా పేర్కొంది.

మా వారు వంట చేస్తున్నారండి..

మా వారు వంట చేస్తున్నారండి..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రాబిన్ ఊతప్ప, జోస్ బట్లర్ సతీమణులు మాట్లాడుతూ.. ఈ క్వారంటైన్ సమయంలో తమ వారు వంట చేస్తున్నారని తెలిపారు. యువ ప్లేయర్ రియాన్ పరాగ్ తల్లి మాట్లాడుతూ..తన కొడుకు కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నాడని చెప్పింది.బ్యాటింగ్ కోచ్ అమోల్ ముజుమ్‌దార్ కూతురు, భార్య మాట్లాడుతూ.. పాట పాడుతూ ఇళ్లంతా తిరుగుతున్నాడని, తప్ప తప్పుగా కూడా పాడుతున్నారని పేర్కొన్నారు.

సంతోషంగా ఉంది, కానీ..

సంతోషంగా ఉంది, కానీ..

ఇళ్లంతా గందరగోళం చేస్తున్నాడని పేసర్ వరుణ్ ఆరోన్ భార్య ఫిర్యాదు చేసింది. వారి ఇంట్లో ఉండటం చాలా సంతోషంగా ఉందని అందరూ అంగీకరించారు.

అయితే జోస్ బట్లర్ సతీమణి లూయిస్ బట్లర్ మాట్లాడుతూ.. ఈ ప్రశ్న రెండు వారాల తర్వాత అడిగితే మా అభిప్రాయాలు మారవచ్చని సరదాగా వ్యాఖ్యానించింది.

గత సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన రాజస్థాన్ ఈ సారి టైటిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సారథ్య బాధ్యతల నుంచి అజింక్యా రహానేను తప్పించి స్టీవ్ స్మిత్‌కు అప్పగించింది. అలాగే వేలంలో రాబిన్ ఊతప్ప, టామ్ కరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లను కొనుగోలుచేసింది. వాస్తవానికి మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. తొలుత ఏప్రిల్ 15కు ఆ తర్వాత నిరవధికంగా వాయిదా పడింది.

Story first published: Monday, April 20, 2020, 14:57 [IST]
Other articles published on Apr 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X