న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఓడి గెలిచిన ముంబై ఇండియన్స్.. ఆ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ కానుందా?

Will Mumbai Indians Repeat the Same Sentiment In IPL 2021?

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అద్భుతం చేసిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2021 సీజన్‌లో బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 10 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ చర్చకు దారితీసింది.

ఇలా ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్‌లో ఓడి సెకండ్ మ్యాచ్ గెలిచిన ప్రతీసారి టైటిల్ గెలుచుకుంది. ఈ సారి కూడా ఇదే పునరావృతం కావడంతో మళ్లీ ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2021 టైటిల్‌ను కూడా రోహిత్ సేన అందుకుంటుందని జోస్యం చెబుతున్నారు.

గత 8 ఏళ్లుగా శుభారంభం లేదు..

గత 8 ఏళ్లుగా శుభారంభం లేదు..

ఇక ముంబై ఇండియన్స్ గత 8 ఏళ్లలో ఐదు సార్లు టైటిల్ గెలిచినప్పటికీ.. ఈ 8 సీజన్లలో ఒక్కసారి కూడా శుభారంభం అందుకోలేదు. తాజా సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్‌లో కూడా ముంబై ఈ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచిన 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో నాలుగు సార్లు ఆ జట్టు ఫస్ట్ మ్యాచ్ ఓడి సెకండ్ మ్యాచ్ గెలిచింది.

2015 మినహా..

2015 మినహా..

ముంబై గెలిచిన ఈ ఐదు సీజన్లలో ఒక 2015లోనే ముంబై వరుసగా ఓటమిపాలైంది. కానీ 2013లో ఆర్‌సీబీ చేతిలో ఫస్ట్ మ్యాచ్ ఓడి.. సెకండ్ మ్యాచ్‌లో చెన్నైపై గెలుపొందింది. 2015లో ఈ సెంటిమెంట్ రిపీట్ కాకపోయినా టైటిల్ నెగ్గింది. 2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన ముంబై.. సెకండ్ మ్యాచ్‌లో కోల్‌కతాపై గెలుపొందింది. 2019, 2020లోనూ ఇదే తరహాలో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడి.. రెండో మ్యాచ్‌లో గెలిచిన ముంబై టీమ్ టోర్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2020లో చెన్నై చేతిలో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతాపై గెలిచింది. 2019లో ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచింది.

 ఈసారి ముంబైదే..

ఈసారి ముంబైదే..

తాజా సీజన్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడిన డిఫెండింగ్ చాంపియన్.. సెకండ్ మ్యాచ్‌లో కోల్‌కతాపై అద్భుత విజయాన్నందుకుంది. దాంతో ఈ సెంటిమెంట్ మరోసారి నిరూపితంకానుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కూడా టైటిల్ ముంబైదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెంటిమెంట్‌కు సంబంధించిన గణంకాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేదా? అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది.

సూపర్బ్ విక్టరీ..

సూపర్బ్ విక్టరీ..

కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రోహిత్ శర్మ(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్(5/15) ఐదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా.. కమిన్స్ 2, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైటరైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు ఓపెనర్లు నితీష్ రాణా(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శుభ్‌మన్ గిల్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33) శుభారంభం అందించినా ఫలితం లేకపోయింది. రాహుల్ చాహర్ 4 వికెట్లతో కోల్‌కతా పతనాన్ని శాసించాడు.

Story first published: Wednesday, April 14, 2021, 17:55 [IST]
Other articles published on Apr 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X