న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంత సులువు కాదు! విండిస్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్-3 బ్యాట్స్‌మెన్ వీరే!

IND V WI 2019, 1st ODI : Top 3 Indian Batsmen With Most ODI Runs In West Indies || Oneindia Telugu
West Indies vs India 2019: Top 3 Indian Batsmen with most ODI runs in West Indies

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు ఎంతోమంది గొప్ప బ్యాట్స్‌మెన్లను చూసింది. మరోవైపు వెస్టిండీస్ చరిత్రను గను చూస్తే ప్రపంచ స్థాయి బౌలర్లను ఉత్పత్తి చేసిన ఘనత వారిది. కాబట్టి ఈ రెండు జట్లు కలిసి ప్రతి సారీ బ్యాట్‌కు బంతికి మధ్య గొప్ప పోటీ ఉంటుంది.

ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభమవుతుంది. టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. మరోవైపు టీ20 సిరిస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వెస్టిండిస్ భావిస్తోంది.

<strong>1st ODI: మ్యాచ్ డిటేల్స్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ గణాంకాలివే!</strong>1st ODI: మ్యాచ్ డిటేల్స్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ గణాంకాలివే!

1
46247

కరేబియన్ పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామాలు. అలాంటి కరేబియన్ దీవుల్లో బ్యాట్స్‌మెన్లు గనుక రాణించారంటే అటు అభిమానులతో పాటు ఇటు క్రికెట్ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించాల్సిందే. అలాంటి వెస్టిండిస్ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిద్దాం...

విరాట్ కోహ్లీ - 591 పరుగులు

విరాట్ కోహ్లీ - 591 పరుగులు

మోడ్రన్ డే క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నా... ఫార్మాట్‌తో సంబంధంతో లేకుండా విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తోన్న సంగతి తెలిసిందే. కరేబియన్ దీవువల్లో వెస్టిండిస్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 45.56 యావరేజితో పాటు 87.29 స్ట్రయిక్ రేట్‌తో 591 పరుగులు చేశాడు. కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఒకటికి మించి సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మన్ కోహ్లీనే.

ఇంగ్లాండ్ లీగ్‌లో బాబర్ ఆజాం విజృంభణ.. దెబ్బకు వెబ్‌సైట్ క్రాష్ అయింది

యురవాజ్ సింగ్ - 555 పరుగులు

యురవాజ్ సింగ్ - 555 పరుగులు

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యువరాజ్ సింగ్ గొప్ప మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్. ఇటీవల యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన హార్డ్-హిట్టింగ్‌తో బ్యాటింగ్ ఆల్ రౌండర్ పేరొందిన యువరాజ్ సింగ్అనేక దేశాలపై గొప్ప రికార్డులను సొంతం చేసుకున్నాడు. కరేబియన్‌ గడ్డపై యువరాజ్‌కు మంచి రికార్డు ఉంది. వెస్టిండిస్‌పై భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ సింగ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. యువీ మొత్తం 17 మ్యాచ్‌ల్లో 37 యావరేజితో 555 పరుగులు చేశాడు.

మరో 144 పరుగులు చేస్తే: విండిస్ పర్యటనలో కోహ్లీ బద్దలు కొట్టే రికార్డులివే!

మహేంద్ర సింగ్ ధోని - 532 పరుగులు

మహేంద్ర సింగ్ ధోని - 532 పరుగులు

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గ్రేటేస్ట్ ఫినిషర్లలో ఒకడు. వెస్టిండిస్ జట్టుపై ధోని కూడా మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. వెస్టిండిస్ జట్టుపై ధోని మొత్తం 19 మ్యాచ్‌ల్లో 48కిపైగా యావరేజితో 532 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వెస్టిండిస్ జట్టుపై ధోని అత్యధిక స్కోరు 95. 2013లో కరేబియన్ దీవుల్లో జరిగిన ముక్కోణపు సిరిస్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ స్కోరు సాధించాడు.

Story first published: Wednesday, August 7, 2019, 19:08 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X