న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో 144 పరుగులు చేస్తే: విండిస్ పర్యటనలో కోహ్లీ బద్దలు కొట్టే రికార్డులివే!

India vs West Indies 2019 : Virat Kohli On The Point Of Odi Milestones || Oneindia Telugu
India vs West Indies: Virat Kohli on the cusp of ODI milestones

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా విండిస్‌తో మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. ఈ మూడు వన్డేల సిరిస్ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది.

విండిస్ పర్యటనతో ఈ సీజన్‌ను కొత్తగా ఆరంభించాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగా వెస్టిండిస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరిస్‌లో విరాట్ కోహ్లీ పలు వన్డే రికార్డులపై కన్నేశాడు. ఇప్పటికే వెస్టిండిస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌ రికార్డుని కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.

<strong>పరుగులు చేయలేకపోతే పిచ్చెక్కుతుంది: కోహ్లీతో సెంచరీ భాగస్వామ్యంపై పంత్</strong>పరుగులు చేయలేకపోతే పిచ్చెక్కుతుంది: కోహ్లీతో సెంచరీ భాగస్వామ్యంపై పంత్

33 మ్యాచ్‌ల్లో 1912 పరుగులు

33 మ్యాచ్‌ల్లో 1912 పరుగులు

వెస్టిండిస్‌తో ఇప్పటివరకు మొత్తం 33 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 70.81 యావరేజితో 1912 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. ఏదైనా దేశంపై కోహ్లీ అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ఉందంటే అది వెస్టిండిస్‌పైనే కావడం విశేషం. ఇక, ఈ జాబితాలో కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఆర్మీలో విధులు.. అమితాబ్ పాటతో తోటి సైనికులను అలరించిన ధోనీ

రెండో స్థానంలో సచిన్

రెండో స్థానంలో సచిన్

వెస్టిండిస్‌పై మొత్తం 39 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్కర్ 1573 పరుగులు చేశాడు. బ్యాటింగ్ గ్రేట్ డెస్మండ్ హేన్స్ 1357 పరుగులు(36 మ్యాచ్‌లు)తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం నుంచి వెస్టిండిస్‌తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరిస్‌లో కోహ్లీ ఓ సరికొత్త రికార్డుపై కన్నేశాడు.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

వెస్టిండిస్ గడ్డపై భారత్-విండిస్ జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విండిస్ బ్యాట్స్‌మన్ రామ్‌నరేశ్ శర్వణ్ ఉన్నాడు. రామ్‌నరేశ్ శర్వణ్ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడి 700 పరుగులు చేశాడు. అదే కోహ్లీ 12 మ్యాచ్‌ల్లో 55.60 యావరేజితో 556 పరుగులు చేశాడు.

కోహ్లీ మరో 144 పరుగులు చేస్తే

కోహ్లీ మరో 144 పరుగులు చేస్తే

ఈ పర్యటనలో కోహ్లీ మరో 144 పరుగులు చేస్తే రామ్‌నరేశ్ శర్వణ్ రికార్డుని బద్దలు కొడతాడు. ఇక, ఈ జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ 512 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో పాటు వెస్టిండిస్ గడ్డపై అత్యధిక సెంచరీలు ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ... డెస్మండ్ హేన్స్(2 సెంచరీలు)తో కలిసి సంయుక్తంగా కొనసాగుతున్నాడు. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ ఈ రికార్డుని కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

టీ20ల్లో ధోని రికార్డుని బద్దలు కొట్టిన రిషబ్ పంత్

భారత్-వెస్టిండిస్ వన్డే షెడ్యూల్ ఇదే:

భారత్-వెస్టిండిస్ వన్డే షెడ్యూల్ ఇదే:

భారత్ vs వెస్టిండిస్, 1st ODI, గుయానా - August 8

భారత్ vs వెస్టిండిస్, 2nd ODI, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ - August 11

భారత్ vs వెస్టిండిస్, 3rd ODI, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ - August 14

వెస్టిండిస్‌తో వన్డేల్లో తలపడే భారత క్రికెట్ జట్టు

వెస్టిండిస్‌తో వన్డేల్లో తలపడే భారత క్రికెట్ జట్టు

Virat Kohli (Captain), Rohit Sharma (VC), Shikhar Dhawan, KL Rahul, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (wk), Ravindra Jadeja, Kuldeep Yadav, Yuzvendra Chahal, Kedar Jadhav, Mohammed Shami, Bhuvneshwar Kumar, Khaleel Ahmed, Navdeep Saini

Story first published: Wednesday, August 7, 2019, 16:37 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X