For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ లీగ్‌లో బాబర్ ఆజాం విజృంభణ.. దెబ్బకు వెబ్‌సైట్ క్రాష్ అయింది

Babar Azam’s Popularity Crashes Somerset’s Official Website || Oneindia Telugu
Babar Azam’s popularity crashes Somerset’s official website, forces a revamp

హైదరాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజాం పాపులారిటీ ఆకాశాన్ని తాకుతోంది. ఎంతలా అంటే ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వైటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న సోమర్సెట్ వెబ్‌సైట్ క్రాష్ అయ్యేంతలా. పాక్ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా ఉన్న బాబర్ అజాం ఇంగ్లాండ్ దేశీయ టీ20 లీగ్‌లో సోమర్సెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇటీవలే బాబర్ ఆజాం సోమర్సెట్ జట్టు తరుపున ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా మంగళవారం గ్లామోర్గాన్ జట్టుతో సోమర్సెట్ తలపడింది. అయితే, ఈ మ్యాచ్‌‌ని యూ ట్యాబ్‌లో నిర్వాహకులు లైవ్ టెలికాస్ట్ చేయకపోవడంతో పాకిస్థాన్‌కు చెందిన మిలియన్ కొద్దీ అభిమానులు స్కోరు వివరాలు తెలుసుకునేందుకు సోమర్సెట్ వెబ్‌సైట్‌ని సందర్శించారు.

దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరగడంతో సోమర్సెట్ వెబ్‌సైట్ క్రాష్ అయింది. వెంటనే తేరుకున్న సోమర్సెట్ క్లబ్ యాజమాన్యం వెబ్‌సైట్ సర్వస్ కెపాసిటీని అప్ గ్రేడ్ చేసుకుంది. ఫస్ట్ మ్యాచ్‌కే వచ్చిన ఆదరణను చూసి సోమర్సెట్ యాజమాన్యం ఉబ్బితబ్బివుతోంది. ఈ విషయమై సోమర్సెట్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బెన వార్రెన్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ లీగ్‌లో సోమర్సెట్ ఆడబోయే మిగతా మ్యాచ్‌లను యూ ట్యూట్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, 24 ఏళ్ల బాబర్ అజాం ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ దేశవాళీ టీ20 లీగ్ అయిన వైటాలిటీ బ్లాస్ట్ టీ20లో బాబర్ అజాం ఇప్పటికే ఆరు ఇన్నింగ్స్‌ల్లో 267 పరుగులు చేశాడు.

హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజాం 95 పరుగులు చేయగా... ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 83 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత సోమర్సెట్ ఆడిన మ్యాచ్‌ని 1.5 మిలియన్ వ్యూస్‌ని తెచ్చిపెట్టింది.

Story first published: Wednesday, August 7, 2019, 17:37 [IST]
Other articles published on Aug 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+