న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆల్‌టైమ్ గ్రేట్ క్యాచ్.. 46 ఏళ్ల వయసులోనూ సూపర్ డైవ్.. చూస్తే వావ్ అనాల్సిందే! (వీడియో)

Watch Slip fielder shows stunning dives from first slip to take a classy catch at leg slip

కేప్‌టౌన్‌: వరల్డ్ క్రికెట్‌కు సౌతాఫ్రికా టీమ్ సూపర్ డూపర్ ఫీల్డర్లను పరిచయం చేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ దేశ దిగ్గజాలు జాంటీ రోడ్స్, హెర్షెల్ గిబ్స్, ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డూప్లెసిస్ ఫిల్డింగ్ విన్యాసాలు చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతోంది. వీరిలో జాంటీ రోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరికి తోడు గ్యారీ కిర్‌స్టన్, గ్రేమ్ స్మిత్, జాక్వస్ కల్లీస్ స్లిప్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసేవారు.

క్రికెట్‌లో స్లిప్‌ ఫీల్డింగ్‌ చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా క్యాచ్‌ చేజారడమే కాకుండా బంతి శరీరంపైకి దూసుకొచ్చి గాయాలబారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్థానంలో ఫీల్డింగ్‌ చేసే ఆటగాళ్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అయితే తమ దిగ్గజాల తరహాలోనే ఆ దేశ వెటరన్ క్రికెటర్ 46 ఏళ్ల వయసులో మైమరిపించే క్యాచ్ అందుకున్నాడు.

సౌతాప్రికా దేశవాళి క్రికెట్‌లో భాగంగా జరిగిన ఓ 50 ఓవర్ల మ్యాచ్‌లో ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మార్టిన్‌ వాన్‌ జార్స్‌వెల్డ్‌ అనే ప్లేయర్ సూపర్ క్యాచ్‌తో వావ్ అనిపించాడు. బ్యాట్స్‌మెన్‌ బంతిని ఆడే దిశను ముందుగానే పసిగట్టి, ఫస్ట్‌ స్లిప్‌ నుంచి లెగ్‌ స్లిప్‌కు డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

బ్యాట్స్‌మెన్‌ స్కూప్‌ షాట్‌కు ప్రయత్నిస్తున్నాడని ముందే ఊహించిన మార్టిన్.., వికెట్‌కీపర్‌ వెనుక నుంచి అద్భుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టుకొని ఫీల్డ్‌లో ఉన్నవారందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఆ క్రికెటర్‌ చేసిన అద్భుత విన్యాసం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఫీల్డర్‌ చూపిన సమయస్పూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ క్యాచ్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్లిప్‌ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ఫీట్‌ను సాధించిన 46 ఏళ్ల జార్స్‌వెల్డ్‌ సౌతాఫ్రికా తరపున 9టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. అయితే అతను ఇలా మైమరిపించే క్యాచ్ అందుకోవడం ఇదే తొలిసారి కాదు. 2009 దేశవాళీ క్రికెట్‌లోనూ ఈ తరహా క్యాచ్‌నే అందుకున్నాడు.

Story first published: Monday, March 1, 2021, 20:54 [IST]
Other articles published on Mar 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X