న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ అని కాదు.. ఇండియా అని అరవండి(వీడియో)

Watch: Rohit Sharma shows patriotism, asks fans to chant India India instead of Rohit Rohit

హైదరాబాద్: ఇటీవల ఇన్నింగ్స్‌లలో మళ్లీ తన ఫామ్‌ను వెనక్కి తెచ్చుకున్న రోహిత్.. సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. నాల్గో వన్డేలో 162పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్‌ను నెలకొల్పాడు. ఈ క్రమంలో ఓపెనర్‌కు స్టేడియంలో భారీ స్థాయిలో జేజేలు పలుకుకుతున్నారు. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఫీల్డింగ్.. బౌలింగ్‌లలోనూ అద్భుతంగా రాణించి ఆకట్టుకుంది.

రోహిత్.. రోహిత్ కాదు ఇండియా.. ఇండియా

ఫీల్డింగ్‌లో భాగంగా రోహిత్ బౌండరీ లైను వద్దకు వచ్చాడు. రోహిత్ శర్మను దగ్గరగా చూడటంతో అతని అభిమానులు ఒక్కసారిగా రోహిత్.. రోహిత్.. అంటూ అరవడం మొదలుపెట్టారు. దానిని చూసి రోహిత్ శర్మ వెనుదిరిగి తన జెర్సీపై ఉన్న ఇండియా పేరును చూపించాడు. అలా చూపిస్తూ రోహిత్ బదులు ఇండియా అంటూ అరవాల్సిందిగా సూచించాడు. అర్థం చేసుకున్న అభిమానులు ఇండియా.. ఇండియా అంటూ అరవడం మొదలుపెట్టారు. కాగా, ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

భారత క్రికెట్ ప్రమాదంలో ఉంది: గంగూలీ

224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా

224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రోహిత్‌ శర్మ (162; 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సు), అంబటి రాయుడు (100; 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సు) సెంచరీలతో చెలరేగిన వేళ.. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ ఏకంగా 224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. ఖలీల్‌ అహ్మద్‌ (3/13), కుల్‌దీప్‌ (3/42) ధాటికి ఛేదనలో విండీస్‌ 36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది.

పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తా

పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తా

‘బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సెంచరీ, డబుల్‌ సెంచరీల గురించి ఆలోచించను. జట్టు కోసం పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తాను. ఈ రోజు మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేయొచ్చని రాయుడు చెప్పాడు. కానీ నేను బ్యాటింగ్‌ మీదే దృష్టి పెట్టాను. డబుల్‌ సెంచరీ గురించి ఆలోచించలేదు'

Story first published: Wednesday, October 31, 2018, 11:22 [IST]
Other articles published on Oct 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X