
గందరగోళానికి దారితీస్తున్నాయని ఆ లేఖలో
భారత క్రికెట్‌లో ప్రస్తుతం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆందోళన వ్యక్తం చేశాడు. బీసీసీఐలో లైంగిక దాడుల ఆరోపణలు రావడం.. వాటిపై ఆలస్యంగా స్పందించడం గందరగోళానికి దారితీస్తున్నాయని ఆ లేఖలో దాదా పేర్కొన్నాడు.
ధోనీని ఎంపిక చేయకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు: గంగూలీ

ఏం చెప్పాలో నాకు తోచలేదు
‘బీసీసీఐ సీఈఓ జోహ్రీపై ఆరోపణల్లో ఎంత నిజముందో నాకు తెలియదు. కానీ ఈ అంశంపై స్పందించడంలో బోర్డు ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావడం లేదు. బీసీసీఐ వ్యవహారాలు చూస్తున్న సీవోఏలో కూడా భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డులోని సన్నిహితులు కొందరు తాము ఎటువైపు మొగ్గాలో సూచించమని అడగడంతో ఏం చెప్పాలో నాకు తోచలేదు. ఎన్నోఏళ్లు భారత క్రికెట్‌కు సేవలందించిన నేను ప్రస్తుత పరిణామాలపై ఎంతో విచారిస్తున్నాను. క్రికెట్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు' అని గంగూలీ ఆ లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడు.

బీసీసీఐ తీరు ప్రతిష్ఠను దెబ్బతీసిందని
‘ప్రపంచ క్రికెట్‌పై భారత క్రికెట్ అజమాయిషీ, భారత క్రికెట్‌పై కోట్లాది అభిమానుల నమ్మకం, ప్రేమ సడలుతున్నాయి' అని గంగూలీ లేఖలో పేర్కొన్నాడు. రాహుల్ జోహ్రి కేసులో బీసీసీఐ వ్యవహరించిన తీరు బోర్డు ప్రతిష్ఠను దెబ్బతీసిందని అన్నాడు. జోహ్రిపై చర్యలు తీసుకునే విషయంలో సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్, కమిటీలో మరో సభ్యురాలు డయానా ఎడుల్జీల మధ్య ఏర్పడ్డ విభేదాలను కూడా అతడు ప్రస్తావించాడు.

ప్రస్తుతం భారత క్రికెట్ ప్రమాదంలో
సీజన్ మధ్య క్రికెట్ నిబంధనలను మార్చడాన్ని కూడా గంగూలీ తప్పు పట్టాడు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నాడు. ‘సమర్థులైన పరిపాలకులు, గొప్ప క్రికెటర్లు మైదానానికి వేల మంది ప్రేక్షకులను రప్పించారు. భారత క్రికెట్‌ను ఉన్నతస్థితికి చేర్చారు. కానీ ప్రస్తుతం భారత క్రికెట్ ప్రమాదంలో ఉంది' అని గంగూలీ చెప్పాడు.


Click it and Unblock the Notifications

