న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనిలో మరో కోణం: సోషల్ మీడియాలో వీడియో వైరల్

By Nageshwara Rao
WATCH: MS Dhoni reaches boundary in lightning quick time to save four runs in IPL 2018, RCB vs CSK clash

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ధోని బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో అద్భుతమైన కీపింగ్‌తో మరోసారి అభిమానులను అలరించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని బెంగళూరని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. బెంగళూరు ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన దీపక్ చాహర్ బౌలింగ్‌లో బెంగళూరు ఓపెనర్ డికాక్ బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. బ్యాట్ అంచున తాకిన బంతి వికెట్ల వెనుక గాల్లోకి లేచింది. అందరూ బంతిని ధోనీ క్యాచ్‌గా అందుకుంటాడని అనుకున్నారు.

కానీ గాల్లోకి లేచిన బంతి బౌండరీ లైన్‌కి సమీపంలో పడింది. బంతి గాల్లోకి లేచిన వెంటనే.. దానిని వెంబడిస్తూ పరుగెత్తుకుంటూ వెళ్లిన ధోని, బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపాడు. అయితే, ధోని ఇలా బౌండరీ లైన్ వద్దకి వచ్చి బంతిని అందుకోవడం ఇదే తొలిసారని మ్యాచ్ కామేంటేటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా వెనక్కి వెళ్లే బంతుల్ని వికెట్ కీపర్లు ఎవరూ పెద్దగా ప్రయత్నించరు. ఫైన్ లెగ్ లేదా థర్డ్ మ్యాన్ దిశగా ఉన్న ఫీల్డర్లు మాత్రమే ప్రయత్నిస్తారు. ధోని మాత్రం అందుకు భిన్నంగా పరుగెత్తి బంతిని అందుకున్నాడని కామెంటేటర్లు కొనియాడారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 205 పరుగులు చేయగా.. అనంతరం ధోని (70 నాటౌట్‌; 34 బంతుల్లో ఒక ఫోర్, 7సిక్సులు) బాదగా, తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (82; 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)తో చెలరేగడంతో చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, April 26, 2018, 20:15 [IST]
Other articles published on Apr 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X