న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్‌ చేరితే మేం సంతోషించాం : కోహ్లీ

Virat Kohli Says We were Actually Happy for New Zealand when they qualified for ODI World Cup Final

అక్లాండ్ : వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్ చేరినందుకు తాము సంతోషించామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తమను ఓడించే ఫైనల్‌కు చేరినప్పటికి ఆ జట్టు కనబర్చిన స్పూర్తిదాయకమైన ఆట తీరు తమని ముగ్దులు చేసిందన్నాడు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎలా ఆడాలో విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ అన్నిజట్లకు ఓ ఉదాహరణగా నిలిచిందని కొనియాడాడు.

ఇక వన్డే సెమీస్ ఓటమి అనంతరం భారత్ తొలిసారి న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. కివీస్ గడ్డపై ఆరు వారాల సుదీర్ఘ పర్యటనకు కోహ్లీసేన బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

ప్రతీకారమా..?

ప్రతీకారమా..?

ప్రపంచకప్ ఓటమికి రివేంజ్ తీసుకుంటారా? అన్నప్రశ్నకు.. కివీస్ ఆటగాళ్లు చాలా సున్నితమైన మనస్కులని, వారిని చూస్తే అలా అనిపించదని కోహ్లీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే న్యూజిలాండ్ ఆటగాళ్లను చూస్తే ప్రతీకారాలు గుర్తుకురావు. వారితో మేం బాగా కలిసిపోతాం. కేవలం మైదానంలోనే పోటీ ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎలా ఆడాలో అనేదానికి వారు ఓ ఉదాహరణగా నిలిచారు. వారి పట్ల మాకు చాలా గౌరవం ఉంది. పెద్దమనసుతో ఆ జట్టు ఆటను చూసినప్పుడు వారు ఫైనల్ చేరినందుకు చాలా సంతోషం వేసింది.'అని కోహ్లీ తెలిపాడు.

నాయకత్వం అనేది ఫలితాల ద్వారా నిర్ణయించబడదు: కేన్‌కు కోహ్లీ మద్దతు

మా వ్యూహాలు మారొచ్చు..

మా వ్యూహాలు మారొచ్చు..

‘శిఖర్ ధావన్ గాయం మా వ్యూహాలను మార్చవచ్చు. వన్డేల్లో రాజ్‌కోట్ ప్రణాళికలను కొనసాగించాలనుకుంటున్నాం. టాప్‌లో కేఎల్ రాహుల్ ఎలాగో అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ టీ20ల్లో పరిస్థతి వేరేలా ఉంటుంది. ఎందుకంటే లోయర్ ఆర్డర్‌లో రాణించే బ్యాట్స్‌మన్ అవసరం. లోయర్ ఆర్డర్ లో రాణించే బ్యాట్స్‌మన్ విషయంలో మా దగ్గర కొన్ని ఆప్షన్ ఉన్నాయి.'అని కోహ్లీ తెలిపాడు.

రాహుల్ జట్టు మనిషి..

రాహుల్ జట్టు మనిషి..

‘ఇక రాహుల్ అటు కీపర్‌గా బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతన్ని కీపర్‌గా కొనసాగిస్తే జట్టుకు అదనపు బ్యాట్స్‌మెన్ తీసుకోవచ్చు. జట్టు కూడా సమతూకంగా ఉంటుంది. ఇక ఈ విషయంలో బయట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం నాకు తెలుసు. రాహుల్‌ను కీపర్‌గా కొనసాగిస్తే ఇతర ఆటగాళ్ల భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ మాకు జట్టు అవసరం, సమతూకమే ముఖ్యం. ఇక రాహుల్ పూర్తిగా జట్టు మనిషి'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

బిజీ షెడ్యూలపై సెటైర్లు..

బిజీ షెడ్యూలపై సెటైర్లు..

టైట్ ఇంటర్నేషనల్ షెడ్యూల్‌పై కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం నేరుగా మైదానంలో అడుగుపెట్టినట్లే ఉందన్నాడు. ‘భారత సమయానికి ఏడు గంటలు ముందుండే ప్రదేశానికి వచ్చి సర్ధుకోవడం చాలా కష్టం. భవిష్యత్తులో ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను'అని టైట్ షెడ్యూలనుద్దేశించి వ్యాఖ్యానించాడు.

Story first published: Thursday, January 23, 2020, 14:19 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X