నాయకత్వం అనేది ఫలితాల ద్వారా నిర్ణయించబడదు: కేన్‌కు కోహ్లీ మద్దతు

హైదరాబాద్: 'నాయకత్వం అనేది ఫలితాల ద్వారా నిర్ణయించబడుతుందని నేను అనుకోను' న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఉద్దేశించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలివి. ప్రపంచ క్రికెట్‌లో విలియమ్సన్ చాలా స్మార్ట్ క్రికెటర్ అని ప్రశంసించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కివీస్ వైట్‌వాష్ అయినప్పటికీ అది విలియమ్సన్ కెప్టెన్సీ వైఫల్యం వల్ల కాదని అన్నాడు.
కివీస్ గడ్డపై ఆరు వారాల సుదీర్ఘ పర్యటనకు కోహ్లీసేన బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

జట్టు కోసం నేను ఏమి చేయగలను
"నేను చెప్పే విషయం ఒకటే, జట్టు కోసం నేను ఏమి చేయగలను... జట్టును ముందుండి నడిపించడానికి కావాల్సిన విషయాలపై దృష్టి పెడతాను. నాయకత్వం ఎప్పుడూ ఫలితాల ద్వారా నిర్ణయించబడుతుందని నేను అనుకోను. ఇది మీరు జట్టును ఎలా సమకూర్చుకోగలరో.. మీ కింద పనిచేసే వారిని ఎలా పొందగలరో అనే దానిపై ఆధారపడి ఉంటుంది" అని అన్నాడు.

కేన్ అద్భుతంగా చేస్తున్నాడు
"సారథిగా కేన్ విలియమ్సన్ జట్టును నడిపించే తీరు బాగుంటుంది. జట్టులోని సభ్యులకే గౌరవం ఇవ్వడంతో పాటు వారిపై నమ్మకం కూడా ఉంచుతాడు. నేను చూడగలుగుతున్నది ఒక్కటే అతను చాలా చాలా తెలివైన క్రికెటర్" అని స్టప్.కో అనే న్యూజిలాండ్ వైబ్‌సైబ్‌తో అన్నాడు.

ప్రత్యర్ధి జట్టు మీపై గెలిస్తే
"ప్రత్యర్ధి జట్టు మీపై గెలిస్తే .. దానిని మీరు సమిష్టి వైఫల్యంగా అంగీకరించాలి. అంతేతప్ప నాయకత్వం లేదా కెప్టెన్సీ లోపం అనడం సరైంది కాదని నేను అనుకుంటున్నాను. ప్రజలు కొన్నిసార్లు తొందరగా ఓ నిర్ణయానికి వస్తారు. అయితే, వ్యక్తిగతంగా తనకు తాను నిర్ణయించుకోవడమే మంచిదని నేను భావిస్తున్నాను. మీరు ఎవరికైనా కెప్టెన్సీ బాధ్యత ఇచ్చినట్లయితే, అతను దానికి సరిపోతాడా లేదా అనే విషయాన్ని అతడే నిర్ణయిస్తాడని నేను నమ్ముతున్నాను" అని కోహ్లీ తెలిపాడు.

న్యూజిలాండ్ పర్యటన అంటేనే ఓ సవాల్
2009, 2019 సిరీస్‌లను పక్కన పెడితే న్యూజిలాండ్‌లో అడుగుపెట్టి టీమిండియా వన్డే సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. దీంతో ఈ సిరిస్‌ను కోహ్లీసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కివీస్ గడ్డపై విజయం సాధించి సత్తా చాటాలని టీమిండియా ఆతృతగా ఉంది. న్యూజిలాండ్ పర్యటన పర్యటన అంటేనే సవాల్‌తో కూడుకుని ఉంటుంది. అందుకు కారణం కివీస్ గడ్డపై స్వింగ్, సీమ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయి. మరోవైపు వణికించే చలి... న్యూజిలాండ్ వాతావరణం భిన్నంగా ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications