న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: పుజారా, రహానేలను సెలెక్టర్లు చూసుకుంటారు!

Virat Kohli says Not my job on discussing Pujara, Rahane future after Test series loss in South Africa

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేల భవిష్యత్తుపై సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వారు తీసుకోబోయే నిర్ణయం గురించి తాను కామెంట్ చేయలేనన్నాడు. కేప్‌టౌన్ వేదికగా శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఏడు వికెట్లతో ఓడిన టీమిండియా.. సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. పుజారా, రహానే వైఫల్యం టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైంది.

దాంతో ఈ ఇద్దరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీకి వెటరన్ క్రికెటర్ల భవిష్యత్తు గురించి ప్రశ్నించగా.. స్మార్ట్‌గా సమాధానం ఇచ్చాడు.

మా మద్దతు ఉంటుంది..

మా మద్దతు ఉంటుంది..

పుజారా, రహానేలకు ఇకపై కూడా తమ మద్దతు కొనసాగుతుందని, టెస్టు క్రికెట్లో భారత్‌కు వాళ్లెంతో చేశారన్నాడు. అయితే సెలక్టర్లు తీసుకోబోయే నిర్ణయం గురించి తాను మాట్లాడనని చెప్పుకొచ్చాడు. మూడు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ ఇద్దరు చేసిన పరుగులతో పోలిస్తే.. టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో ఎక్కువ పరుగులు వచ్చాయి. మూడు టెస్ట్‌ల్లో కలిపి దక్షిణాఫ్రికా బౌలర్లు 136 ఎక్స్‌ట్రాలు సమర్పించారు.

IND vs SA: టీమిండియా కొంపముంచిన నాలుగు తప్పిదాలు!

బయటి వాళ్లకు తెలియదు..

బయటి వాళ్లకు తెలియదు..

సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ వివాదాస్పద రీతిలో రివ్యూలో బతికిపోవడంతో తీవ్ర అసహనానికి లోనైన భారత ఆటగాళ్లు అధికార బ్రాడ్‌కాస్టర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే విమర్శలు వస్తున్నా.. తమ ప్రవర్తనను భారత కెప్టెన్‌ కోహ్లీ సమర్థించుకున్నాడు.

బయట ఉన్న వాళ్లు తాము అలా ఎందుకు స్పందించామో అర్థం చేసుకోలేరని అన్నాడు. 'ఆ విషయానికి సంబంధించి నేను ఇంకేమీ మాట్లాడాలనుకోవట్లేదు. మైదానంలో ఏం జరుగుతుందో మాకే తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుందన్నది బయటి వాళ్లకు సరిగ్గా తెలియదు'' అని కోహ్లీ చెప్పాడు.

IPL 2022: బిగ్‌న్యూస్.. సీఎస్‌కే కెప్టెన్సీకి ఎంఎస్ ధోనీ గుడ్‌‌బై!

బ్యాటింగ్ వైఫల్యమే..

బ్యాటింగ్ వైఫల్యమే..

బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని విరాట్ కోహ్లీ లెలిపాడు. బ్యాటింగ్‌ విభాగంపై దృష్టి సారించాల్సిందేనని, ఇలా కుప్పకూలడం ఏ మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. 'ఈ ఓటమి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. దీనికి ఎలాంటి సాకులు చెప్పకూడదు. సౌతాఫ్రికాలో ఆ జట్టును ఓడించాలని అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆ సిరీస్‌ విజయం మా జట్టు ఉత్తమ ప్రదర్శనకు నిదర్శనంగా నిలుస్తుందని అనుకున్నారు. కానీ మేం అది సాధించలేదు. అదే వాస్తవం. దాన్ని ఆమోదించి మెరుగైన క్రికెటర్లుగా తిరిగి బలంగా పుంజుకోవాలి.

తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నాం. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లోనూ సౌతాఫ్రికా జట్టు కీలక సమయాల్లో బంతితో రాణించింది. మేం సద్వినియోగం చేసుకోలేని పరిస్థితులను ఆ జట్టు చక్కగా ఉపయోగించుకుంది. విజేతగా నిలిచేందుకు ఆ జట్టుకు పూర్తి అర్హత ఉంది. బౌలింగ్‌ పరంగా మాకు ఇబ్బంది లేదు. బ్యాటింగ్‌లోనే సమస్యలున్నాయి.'అని కోహ్లీ ఓటమిని అంగీకరించాడు.

సఫారీ సూపరో సూపర్..

సఫారీ సూపరో సూపర్..

సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత టఫ్ ఫేజ్‌లో ఉన్న సౌతాఫ్రికాకు యువ ఆటగాళ్లు అద్భుత విజయాన్ని అందించారు. భారత్ విధించిన 212 పరుగుల లక్ష్యాన్ని సఫారీ టీమ్ మూడు వికెట్లు కోల్పోయి సులువుగా చేజ్ చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 101/2 నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికాను యంగ్‌స్టర్ కీగన్ పీటర్సన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) సూపర్ బ్యాటింగ్‌కు వాండర్ డుసెన్(41 నాటౌట్), టెంబా బవుమా(32 నాటౌట్) రాణించడంతో సునాయస విజయాన్నందుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, శార్దూల్ తలో వికెట్ తీశారు.

Story first published: Saturday, January 15, 2022, 10:20 [IST]
Other articles published on Jan 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X