
ఓపెనర్ల వైఫల్యం..
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్(12, 10), మయాంక్ అగర్వాల్(15, 7) రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులకే వెనుదిరిగిన ఈ జోడీ.. రెండో ఇన్నింగ్స్‌లో 24 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఈ ఇద్దరి వైఫల్యం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఇద్దరూ కనీసం 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినా.. తర్వాత వచ్చి బ్యాట్స్‌మన్ పని సులువయ్యేది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో రాహుల్ సెంచరీతో చెలరేగగా.. మయాంక్ హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఆ తరహా ప్రదర్శననే ఈ మ్యాచ్‌లో కొనసాగిస్తే భారత్ ఫలితం మరోలా ఉండేది.

మిడిలార్డర్ వైఫల్యం..
ఓపెనర్లకు తోడుగా మిడిలార్డర్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ముఖ్యంగా చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే పేలవ బ్యాటింగ్ జట్టు ఓటమికి కారణమైంది. రెండో టెస్ట్‌లో హాఫ్ సెంచరీలతో తుది జట్టులో చోటు కాపాడుకున్న ఈ ఇద్దరూ కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసారు. ఇక విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. పంత్‌తో బాగానే ఆడిన కోహ్లీ.. అనవసర షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా బ్యాటింగ్ తీరు మరోలా ఉండేది.

చెత్త ఫీల్డింగ్, పసలేని బౌలింగ్..
తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని 210 పరుగులకే కుప్పకూల్చిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఏ దశలోనూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచలేకపోయారు. దీనికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియా కొంపముంచింది. బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై 212 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ భారత బౌలర్లు కనీసం పోరాట పటిమ చూపలేకపోయారు. ముఖ్యంగా బుమ్రా, షమీ ఫస్ట్ ఇన్నింగ్స్ మాదిరి వికెట్లు తీయలేకపోయారు.

యువ ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వకపోవడం..
పుజారా, రహానే వరుసగా విఫలమవుతున్నా వారిని తుది జట్టులో నుంచి తప్పించకపోవడం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. ఈ ఇద్దరి స్థానాల్లో యువ ఆటగాళ్లు అయిన శ్రేయస్ అయ్యర్, హనుమ విహారిలను ఆడిస్తే భారత బ్యాటింగ్ మెరుగ్గా ఉండేది. శ్రేయస్ అయ్యర్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ, హాఫ్ సెంచరీతో సత్తా చాటి ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి ఆటగాడిని కాదని అనుభవం పేరిట పుజారా, రహానేలకు అవకాశాలిచ్చి టీమిండియా మేనేజ్‌మెంట్ ఘోర తప్పిదం చేసింది. ఇక హనుమ విహారి రెండో టెస్ట్‌లో ఒంటరి పోరాటం చేసి ఆకట్టుకున్నాడు. అతను గనుక మూడో టెస్ట్‌లో ఉంటే.. వికెట్లు పడకుండా అడ్డుకునేవాడు.


Click it and Unblock the Notifications












