న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీరులారా సెల్యూట్.. వీరజవాన్లరా మీ త్యాగం అమరం.. క్రికెట్ లోకం ఘన నివాళి!

Virat Kohli, Rohit Sharma And Other Cricketers Pay Condolences To Martyrs Of Galwan Clash

న్యూఢిల్లీ: ఇండో-చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన ఈ ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్‌లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈపోరులో తెలుగువాడైన ఒక కల్నల్‌తో పాటు 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు మంగళవారం రాత్రి భారత ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనపై యావత్ భారతం అట్టుడికిపోతుంది. డ్రాగన్ కంట్రీ చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

అలాగే దేశం కోసం నెలకొరిగిన వీరజవాన్లకు ఘన నివాళులర్పిస్తుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ల, అభిమానులు కూడా దేశ రక్షణ కోసం అమరులైన జవాన్ల మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'సెల్యూట్ సూపర్ హీరోస్.. మీ త్యాగం అమరం'అని ట్విటర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు జవాన్ల మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వీరులారా.. పాదాభివందనం..

‘గల్వాన్ లోయలో దేశ రక్షణ కోసం పోరాడి నెలకొరిగిన జవాన్లకు నా పాదాభివందనం. సైనికుడిని మించిన నిస్వార్థుడు, ధైర్యవంతుడు లేడు. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్టకాలంలో మన ప్రార్థనలతో వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఆశిస్తున్నా'-విరాట్ కోహ్లీ

రియల్ హీరోలకు సెల్యూట్.

‘సరిహద్దుల్లో దేశం కోసం పోరాడి వీర మరణం పోందిన మా రియల్ హీరోలకు సెల్యూట్. వారి కుటంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా.'- రోహిత్ శర్మ

మీ త్యాగానికి రుణపడి ఉంటాం..

‘గల్వాన్ లోయలో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లరా.. మీ త్యాగానికి మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం. జైహింద్'-ఇర్ఫాన్ పఠాన్

వీరజవాన్లకు బిగ్ సెల్యూట్

‘మన మాతృభూమి రక్షణ కోసం రాత్రి, పగలు అహర్నీషులు కష్టపడుతున్న వీరజవాన్లకు బిగ్ సెల్యూట్. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి'-ఇషాంత్ శర్మ

‘గల్వాన్ లోయలో ప్రాణాలు వదిలిన వీర జవాన్లకు నా నివాళులు. మీ త్యాగం నేను, ఈ దేశం ఎప్పటికీ మరవదు. సెల్యూట్ హీరోస్. జైహింద్' -అమిత్ మిశ్రా

ఈ దారుణలు ఆగిపోవాలి.

‘గల్వాన్ లోయలో వీరమరణం పొందిన జవాన్ల ధైర్యానికి నా సెల్యూట్. ఈ దారుణాలన్నీ ఆగిపోవాలి. ఎంతో విలువైన మానవ జీవితానికి అవసరమైన శాంతియుత ప్రపంచం కావాలి. నా ఆలోచనలన్నీ అమరులైన కుటుంబ సభ్యుల చుట్టే తీరుగుతున్నాయి. వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా'-యువరాజ్ సింగ్

‘గల్వాన్ లోయలో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు హృదయపూర్వక సంతాపాన్ని ప్రకటిస్తున్నా. ఓవైపు దేశం మహమ్మారితో పోరాడుతుంటే మరో వైపు ఇలాంటి ఘటనలు జరగడం బాధకంర. ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నా'-వీరేంద్ర సెహ్వాగ్

చైనా ఉత్పత్తులు నిషేధించాలి..

ఇక డ్రాగన్ కంట్రీ చైనా చేసిన దారుణానికి బదులివ్వాలని, ఆ దేశ ఉత్పత్తులను నిషేధించాలని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు, మరో ఇద్దరు జవాన్లు గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణల్లో మృతి చెందారని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దాన్ని రీ ట్వీట్ చేస్తూ భజ్జీ.. చైనా ఉత్పత్తులను నిషేధించాలన్నాడు.

‘20 మంది సైనికులు వీర మరణం పొందడం బాధాకరం. సోదరులారా మీ ఆత్మకు శాంతి కలగాలి. మీ ధైర్య సాహసాలకు నా వందనం. మీ త్యాగం మరవలేనిది. దేశం మొత్తం ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఇది. '-సురేశ్ రైనా

అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆడిన సచిన్!

Story first published: Wednesday, June 17, 2020, 14:00 [IST]
Other articles published on Jun 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X