న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వావ్.. కోహ్లీ, ఫీల్డింగ్ అంటే ఇది.! (వీడియో)

India Vs New Zealand 1st ODI : Virat Kohli Fielding Effort Leaves Fans In Awe
Virat Kohli or Jonty Rhodes? India captains fielding effort leaves fans in awe

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారత్ నిర్దేశించి 348 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య జట్టు దీటుగా బదులిస్తున్న సమయంలో కోహ్లీ తన సూపర్ ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. ఓపెనర్‌ హెన్రీ నికోలస్‌(78)ను రనౌట్‌ చేసి ఔరా అనిపించాడు.

రాహులా మిడిలార్డర్ వద్దు.. ఓపెనింగే ముద్దు : గంభీర్రాహులా మిడిలార్డర్ వద్దు.. ఓపెనింగే ముద్దు : గంభీర్

రెప్పపాటులో

భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 29 ఓవర్‌ మూడో బంతిని డిఫెన్స్ చేసిన రాస్‌ టేలర్‌ సింగిల్‌ తీసే యత్నం చేశాడు. అయితే కవర్స్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ అంతే వేగంగా బంతినందుకొని బ్యాట్స్‌మన్‌ కంటే వేగంగా పరుగు పెట్టి అద్భుత డైవ్‌తో వికెట్లను కొట్టేశాడు. ఇదంతా రెప్పపాటు సమయంలోనే జరిగిపోయింది. ఇక అనవసర సింగిల్‌ కోసం ప్రయత్నించిన కివీస్‌ మూల్యం చెల్లించుకుంది. 11 ఫోర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడిన నికోలస్ ఔటవ్వడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

కోహ్లీనా? లేక జాంటీ రోడ్స్..?

ఇక కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌కు ముగ్ధులైన అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక ఐసీసీ కూడా కోహ్లీనా లేక సౌతాఫ్రికా దిగ్గజం.. సూపర్ ఫీల్డింగ్‌కు మారు పేరైన జాంటీ రోడ్స్? అంటూ కొనియాడుతు ట్వీట్ చేసింది. కోహ్లీ అద్భుతం చేశాడని అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు

నాలుగో టీ20లోనూ..

నాలుగో టీ20లోనూ..

ఇక అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసాలతో అబ్బూరపరిచాడు. నాలుగో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కొలిన్ మున్రో( ఫోర్లు, 3 సిక్స్‌లతో 64)ను అద్భుత రనౌట్‌తో పెవిలియన్ చేర్చాడు. సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించి ఆడిన మున్రోను కోహ్లి రనౌట్‌ చేసిన తీరు ప్రతీ ఒక్కరిని అబ్బురపరిచింది.

ఆ మ్యాచ్‌లో దూబే వేసిన 12 ఓవర్‌‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఆ ఓవర్ నాల్గో బంతిని మున్రో కవర్స్‌ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న శార్దూల్‌ ఠాకూర్‌ బంతిని అందుకున్న మరుక్షణమే షార్ట్‌ కవర్స్‌లో ఉన్న కోహ్లికి అందించాడు. అంతే వేగంగా బంతిని అందుకున్న కోహ్లి స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఉన్న వికెట్లకు నేరుగా కొట్టాడు. దీంతో మున్రో విధ్వంసానికి బ్రేక్‌లు పడ్డాయి. అనంతరం సునాయసంగా గెలిచే న్యూజిలాండ్ టై చేసుకొవడం.. సూపర్ ఓవర్‌కు దారితీయడం.. భారత్ గెలవడం అలాచకచక జరిగిపోయాయి.

ప్ఛ్.. భారత్ ఓటమి..

ప్ఛ్.. భారత్ ఓటమి..

ఇక భారీ స్కోర్ చేసినా తొలి వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు. రాస్ టేలర్(109 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ 4 వికెట్లతో గెలుపొందింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో తొలి సెంచరీ‌తో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.

అనంతరం 348 పరుగులతో దిగిన కివీస్.. 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టేలర్ అజేయ సెంచరీకి తోడు నికోలస్(78), లాథమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. షమీ, ఠాకుర్ చెరొక వికెట్ తీశారు.

1
46208
Story first published: Wednesday, February 5, 2020, 16:04 [IST]
Other articles published on Feb 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X